హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్‌కు సర్వం సిద్ధం.. ఫైనల్స్‌ ఇలా జరుగుతాయి..

మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన మహిళకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా కిరీటాన్ని పెట్టిస్తారు.

హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్‌కు సర్వం సిద్ధం.. ఫైనల్స్‌ ఇలా జరుగుతాయి..

Updated On : May 30, 2025 / 3:11 PM IST

హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి హైటెక్స్‌లో ఫైనల్స్ ప్రారంభమవుతాయి. మిస్‌ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న మహిళలు ట్రైటెండ్ హోటల్, హైటెక్స్‌లో ఫైనల్‌ కోసం రిహార్సల్స్ చేశారు.

అంతకు ముందు మల్టీమీడియా ఛాలెంజ్‌ నిర్వహించారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఒక్కరి చొప్పున నలుగురిని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ విజేతలుగా ప్రకటించింది. శనివారం జరిగే ఫైనల్‌కు 108 దేశాల అందాల భామలు హాజరై మొదట ఖండాల వారీగా ర్యాంప్ వాక్ చేస్తారు. వారిలో 40 మందిని నెక్ట్స్‌ రౌండ్‌కు వెళ్తారు.

Also Read: బీఆర్‌ఎస్‌ నుంచి తనను బహిష్కరిస్తారన్న ప్రచారంపై కవిత స్పందన.. కేటీఆర్‌కు కౌంటర్‌.. సంచలన కామెంట్స్‌

ఆ తర్వాత రౌండుకు 20 మందిని ఎంపిక చేస్తారు. అనంతరం వారిలో 8 మంది షార్ట్‌లిస్ట్ అవుతారు. ఇందులో ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున నిలుస్తారు. వారిని అతివల సమ కాలిక సమస్యలతో పాటు ఇతర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. సమాధానాలు చెప్పిన తీరు ఆధారంగా ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు.

దీంతో పోటీలో నలుగురు నిలుస్తారు. మిస్ వరల్డ్‌ అయితే ఏం చేస్తారన్న చివరి ప్రశ్నను వీరిని అడుగుతారు. ఆ నలుగురిలో బెస్ట్ ఆన్సర్‌ ఇచ్చేవారు మిస్ వరల్డ్‌గా నిలుస్తారు. మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన మహిళకు 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా కిరీటాన్ని పెట్టిస్తారు.