Migjaum Cyclone : మిగ్‌జాగ్ తుపాను విలయం.. అమ్మ కడుపులో బిడ్డ మృతి

ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మిగ్ జాగ్ తుపాను విలయానికి ఓ గర్భిణి కడుపులో బిడ్డను కోల్పోయింది.

Migjaum Cyclone : మిగ్‌జాగ్ తుపాను విలయం.. అమ్మ కడుపులో బిడ్డ మృతి

migjaum cyclone Efect

migjaum cyclone Efect : మిగ్ జాగ్ తుపాను ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది.రైతుల్ని నిండా ముంచింది.అంతేకాదు అమ్మ కడుపులో బిడ్డను కూడా బలితీసుకుంది. ఈ తుపాను ప్రభావం తెలంగాణలో కూడా కనిపించింది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మిగ్ జాగ్ తుపాను వల్ల భారీ వర్షాలు కురిసాయి. దీంతో బుధవారం (డిసెంబర్ 6,2023)న ఓ గర్భిణికి ప్రసవం నొప్పులు రావటంతో అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ చేరుకుంది. కానీ వర్షాల ప్రభావానికి బురదగా మారిన రోడ్డుపై అంబులెన్స్ కూరుకుపోవటంతో గర్భిణి కడుపులో బిడ్డ మృతి చెందింది.

ఎల్లాపూర్ గ్రామంలోని కోయగూడ కాలనీకి చెందిన యోనిగంటి రమ్య అనే గర్భిణికి ప్రసవం నొప్పులు రావటంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ వచ్చింది. ఆమెను తీసుకుని వెళుతుండగా ఏటూరు నాగారం మండలంలోని కమలాపురం మీదుగా రాంనగర్ కు చేరుకునే సయమంలో అక్కడి మిగ్ జాగ్ తుపాన్ ప్రభావం వల్ల కురిసిన వర్షాలకు బురద ఏర్పడి ఆ బురదలో అంబులెన్స్ కూరుకుపోయింది.

దీంతో అంబులెన్స్ ను బురదలోంచి బయటకు నెట్టేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. అప్పటికే ప్రసవం నొప్పులతో అల్లాడిపోతున్న రమ్య నొప్పులు భరించలేక అల్లాడిపోయింది. ప్రసవం జరగాల్సిన సమయానికి ఆస్పత్రికి వెళ్లలేకపోవటంతో రమ్య కడుపులో బిడ్డ మృతి చెందింది. దీంతో తుపాను దెబ్బకు ఓ శిశువు ఈ లోకంలోకి రాకుండానే అమ్మ కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషయం చోటుచేసుకుంది.

మిగ్ జాగ్ తుపాను ఏపీ, తమిళనాడు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.రైతులను నిండా ముంచింది. వేలాది ఎకరాల్లో పంట నీటమునిగి రైతులు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.