మారుతీరావు ఆత్మహత్య తర్వాత తొలిసారి తల్లిని కలిసిన అమృత
ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా

ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా
ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా మిర్యాలగూడలో తల్లి ఇంటికి వెళ్లిన అమృత తన తల్లిని కలిసి మాట్లాడింది. భర్తను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిని అమృత ఓదార్చింది. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. మారుతీరావు ఆత్మహత్య తర్వాత తల్లిని అమృత కలవడం ఇదే తొలిసారి.
మారుతీరావుని అమృత చివరి చూపు చూడలేపోయింది. స్మశాన వాటికకు వెళ్లగా, అమృత గో బ్యాక్ అంటూ మారుతీరావు బంధువులు నినాదాలు చేశారు. అమృతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చివరి చూపు చూడకుండానే అమృత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, తల్లి దగ్గరకు వెళ్లాలని మారుతీరావు సూసైడ్ నోట్ లో అమృతను కోరిన సంగతి తెలిసిందే. అయితే ప్రణయ్ తల్లిదండ్రులను వదిలిపెట్టి తాను తల్లి దగ్గరకు వెళ్లలేనని అమృత తేల్చి చెప్పింది. ఒకవేళ తన తల్లి తన దగ్గరికి వచ్చి ఉంటే మాత్రం.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారవేత్త, అమృత తండ్రి మారుతీరావు మార్చి 7న ఆత్మహత్య చేసుకున్నారు. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ కు వచ్చిన మారుతీరావు ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో బస చేశారు. రూమ్ లో సూసైడ్ చేసుకున్నారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. కూతరు కులాంతర ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిపోవటంతో మారుతీరావు ఆవేదన చెందారని బంధువులు చెబుతున్నారు.
కిరాయి మనుషులతో కూతురు భర్త ప్రణయ్ ను మారుతీరావు హత్య చేయించాడనే అభియోగాలు ఉన్నాయి. ప్రణయ్ హత్య కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు ఏడు నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్ పై జైలు నుంచి రిలీజ్ అయిన మారుతీరావు మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యారని, ఈ క్రమంలో ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.