Osmania Hospital : ఉస్మానియా ఆస్పత్రి భవనం సురక్షితం కాదు : నిపుణుల కమిటీ
ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ భవనం సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆసుపత్రికి ఆ భవనం పనికిరాదని స్పష్టం చేసింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది. వారసత్వ కట్టడం కాబట్టి.. ఉస్మానియా భవనానికి ఆర్కిటెక్ట్ పర్యవేక్షణలో మరమ్మతులు చేయవచ్చని సూచించింది.

Osmania Hopital
Osmania Hospital : ఘనమైన చరిత్ర కలిగిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ భవనం సురక్షితం కాదని నిపుణుల కమిటీ తేల్చింది. ఆసుపత్రికి ఆ భవనం పనికిరాదని స్పష్టం చేసింది. భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ ఆస్పత్రికి కాకుండా ఇతర అవసరాలకే ఉపయోగించవచ్చని తెలిపింది. వారసత్వ కట్టడం కాబట్టి.. ఉస్మానియా భవనానికి ఆర్కిటెక్ట్ పర్యవేక్షణలో మరమ్మతులు చేయవచ్చని సూచించింది. అయితే ఆస్పత్రిగా వాడుకోవాలంటే మాత్రం ఆక్సిజన్, మంచినీరు, సివరేజీ, గ్యాస్‌పైప్‌లైన్ల వంటి పనుల అవసరం ఉంటుందని సూచించింది. ఈ మరమ్మతులన్నీ చేస్తే భవనం హెరిటేజ్, నిర్మాణ పటిష్టత దెబ్బతింటుందని నిపుణుల కమిటీ తెలిపింది.
ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని కూల్చి కొత్తగా నిర్మించాలని కొందరు, వారసత్వ కట్టడం కాబట్టీ… కూల్చవద్దని మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో కొంతకాలంగా విచారణ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఉస్మానియా ఆస్పత్రి భవనం పరిశీలనకు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ప్రజారోగ్యశాఖల ఈనెన్సీలు, జీహెచ్‌ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్‌తోపాటు ఎన్‌ఐటీ, ఐఐటీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం భవన నిర్మాణాన్ని పరిశీలించింది చేసింది.
Telangana High Court : ఉస్మానియా భవన నిర్మాణంపై అలసత్వం ఎందుకు ? ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
అనంతరం నివేదిక రెడీ చేసింది. నిపుణుల కమిటీ నివేదికను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు సమర్పించారు. కమిటీ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం తెలిపేందుకు కొంత గడువు కావాలని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద దర్మాసనాన్ని ఏజీ కోరారు. నివేదికను పిటిషనర్లు కూడా అధ్యయనం చేసిన తర్వాత విచారణ చేపడతామన్న హైకోర్టు…. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది.