Mahabubabad District : చనిపోయిన శునకానికి సమాధి కట్టించిన యజమాని.. ఆత్మ శాంతించాలని ప్రత్యేక పూజలు
ఓ కుటుంబం శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకుంది. అది అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. దాని మరణం జీర్ణించుకోలేని ఆ కుటుంబం దాని ఆత్మ శాంతి కోసం ఏం చేసింది? చదవండి.

Mahabubabad district
Mahabubabad District : పది సంవత్సరాలుగా శునకాన్నిఎంతో ప్రేమతో పెంచుకున్నారు. అనారోగ్యంతో అకస్మాత్తుగా అది మరణించడాన్ని దాని యజమాని జీర్ణించుకోలేకపోయాడు. ఎన్నో జ్ఞాపకాలు పంచిన శునకానికి తన పొలంలో సమాధి నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఎవరతను..ఎక్కడ? చదవండి.
శునకం ఎంతో విశ్వాసం ఉన్న జంతువు. అందుకే వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటితో అనుబంధం పెంచుకుంటారు. వాటికి ఏమైనా జరగరానిది జరిగినా చాలామంది తట్టుకోలేరు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పూసపెల్లి గ్రామానికి చెందిన రాచర్ల వీరన్న అనే వ్యక్తి పెంచుకుంటున్న శునకం అనారోగ్యంతో అకస్మాత్తుగా చనిపోయింది. అతని కుటుంబం దానిని పది సంవత్సరాలుగా పెంచుకుంటోంది. తమ కుటుంబంలో ఒకరిగా ఎంతో ప్రేమగా పెంచుకున్న శునకం చనిపోవడం ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. కన్నీరు మున్నీరైంది. ఇక దాని జ్ఞాపకాలను మర్చిపోలేని వీరన్న తన పొలంలో దానికి సమాధిని నిర్మించాడు. అంతేనా.. శునకం ఆత్మ శాంతించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Worlds Ugliest Dog 2023 : ప్రపంచంలోనే అంద వికారమైన శునకంగా గెలుపొందిన ‘స్కూటర్’ అనే డాగ్
డాగ్ లవర్స్ చాలామంది ఉంటారు. వాటిని ఎంతగానో ఇష్టపడతారు. కానీ మరీ ఇంత ప్రేమ పెంచుకున్న వీరన్న అభిమానం చూసి స్ధానికులు ఆశ్చర్యపోయారు. వీరన్న తను పెంచిన శునకానికి సమాధి నిర్మించడం ఇప్పుడు జిల్లాలోనే కాదు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.