Anchor Shyamala :అప్పుడు అన్నతో ఇప్పుడు చెల్లితో..షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్

YS షర్మిల అడుగుల్లో ప్రముఖ యాంకర్ శ్యామల అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు జగన్ ను కలిసి వైసీపీలో జాయిన్ అయిన శ్యామల ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.

Anchor Shyamala :అప్పుడు అన్నతో ఇప్పుడు చెల్లితో..షర్మిల పాదయాత్రలో ప్రముఖ యాంకర్

Anchor Shyamala

Updated On : October 28, 2021 / 2:15 PM IST

Anchor Shyamala participates in YS Sharmila padayatra : YS షర్మిల అడుగుల్లో ప్రముఖ యాంకర్ శ్యామల అడుగులు వేస్తోంది. ఒకప్పుడు జగన్ ను కలిసి వైసీపీలో తన భర్తతో కలిసి జాయిన్ అయిన యాంకర్ శ్యామల ఇప్పుడు షర్మిలమ్మ పాదయాత్రలో ఆమెతో పాటు కలిసి నడుస్తున్నారు. తన భర్తతో కలిసి షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు యాంకర్ శ్యామల.

వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. ఈ క్రమంలో ప్రజలతో మమేకం అవుతున్న షర్మిల ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టారు. తన పాదయాత్ర సీఎం కేసీఆర్ కుటుంబ పాలను అంతం చేయటానికి..అణగారిని వర్గాలకు అండగా ఉండటానికేనని చెప్పారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు మంచి స్పందన వస్తోంది. పాదయాత్ర సందర్భంగా ఆమె ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇప్పటికే ఆమెతో పలువురు కలిసి నడుస్తున్నారు. మరెందరో ఆమెకు మద్ధతు తెలుపుతున్నారు. తాజాగా ఈరోజు షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల పాల్గొన్నారు.

Read more : వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం షర్మిల చేస్తున్న పాదయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉందని శ్యామల తెలిపారు. షర్మిలతో కలిసి నడవడానికి తాను సిద్ధమని..గత ఎనిమిది రోజులుగా అక్క పాదయాత్ర చేస్తున్నారని అక్కతో కలిసి నడవటం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి సమస్యలను అక్కతో చెప్పుకుంటున్నారని… ఆ విషయాన్ని తాను స్వయంగా చూశానని..అక్క ఆశయం నెరవేరి ప్రజల కష్టాలు తీరాలని తను ఆశిస్తున్నానని శ్యామల తెలిపారు. షర్మిల అక్కతో కలిసి నడవడానికి తాను సిద్ధమని యాంకర్ శ్యామల తెలిపారు.

Read more : YS Sharmila Comments : కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నా పాదయాత్ర : YS షర్మిల