వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల

వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల

వైసీపీలో చేరిన యాంకర్ శ్యామల

ప్రముఖ యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు జగన్. రాజకీయాల్లోకి యువత రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

యాంకర్ శ్యామల రాజకీయాల్లోకి రావటం.. అందులోనూ జగన్ పార్టీలో చేరటంతో బుల్లితెర షాక్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా ఈ నిర్ణయం ఉందని అంటున్నారు ఇతర నటీనటులు. రాజకీయాల్లోకి రావటంపై శ్యామల స్పందించారు. జగన్ విధానాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్లు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు ప్రకటించారు. 

ఏపీ రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. జగన్ సీఎం కావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు యాంకర్ శ్యామల. రాజకీయాల్లోనూ క్రీయాశీలకంగా పాల్గొంటానని వెల్లడించారామె

×