YS Sharmila Comments : కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నా పాదయాత్ర : YS షర్మిల 

కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నేను పాదయాత్ర చేపట్టానని YS షర్మిల తెలిపారు. పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా షర్మిల వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila Comments : కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నా పాదయాత్ర : YS షర్మిల 

Sharmila Padayathra In Telangana Chevella

YS Sharmila’s key Comments on cm KCR  : తెలంగాణాలో పార్టీ స్థాపించిన నాటినుంచి వై.ఎస్ షర్మిల దూకుడు కొనసాగిస్తున్నారు.గతంలో రైతులను కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకున్న షర్మిల తెలంగాణలో తన పార్టీని నిలుపుకోవటానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్క షర్మిల ఉంటుంది అంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈక్రమంలో రంగారెడ్డి జిల్లాలో చేవెళ్లలో షర్మిల పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో షర్మిల సీఎం కేసీఆర్ ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా కూడా పలువ్యాఖ్యలు చేశారు.

Read more :  YS Sharmila : కేసీఆర్ రాజీనామా చేయాలి..దళితుడిని సీఎం చేయాలి : షర్మిల

కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికే నేను పాద్రయాత్ర చేపట్టానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మా నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తానని..ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తాననీ ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు షర్మిల. తెలంగాణలో మరోసారి వై.ఎస్.ఆర్ నాయకత్వాన్ని తీసుకురావడమే నా లక్ష్యం అనీ.. ప్రతి ఇంటికి సంక్షేమాన్ని తీసుకువస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్ర పాలన మానేసి కుటుంబ సంక్షేమాన్నే చూసుకుంటున్నారనీ..కేసీఆర్ కుటుంబ పాలన అంతం చేయటానికి నేను ఈ యాత్ర చేపట్టానని షర్మిల వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన దొంగ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకుందని..రేవంత్ రెడ్డిలాగా మాకు బ్లాక్ మెయిల్ చేయటం చేతకాదని అన్నారు.

అంతేకాదు ఓ పక్క కేసీఆర్ ను విమర్శిస్తునే మరోపక్క బీజేపీపై కూడా షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కులం, మతం పేరిట చిచ్చు పెడుతోందనీ..బీజేపీని గంగలో కలిపటానికే కూడా నా యాత్ర అని అన్నారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ టిఆర్.ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెండాడడానికేనంటూ పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు…ఏడేళ్ళల్లో ప్రతి వర్గాన్ని మోసం చేస్తునే ఉన్నారని మోసాల పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినా కేసీఆర్ కు ఏమీ పట్టటం లేదని కేవలం కుటుంబం కోసమే పాటు పడుతున్నారంటూ వివమర్శలు సంధించారు. అద్వన్నమైన సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే చెబుతుందని..పేదోళ్లకు కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి పొమ్మన్నారంటూ విరుచుపడ్డారు.తెలంగాణలోని సమస్యలను, కష్టాలను నేరుగా తెలుసుకుని ప్రజల పక్షాన నిలుస్తాం.. నడుస్తాం.. పోరాడతామని ప్రకటించారు. తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన ఉందా..? అంటే ఏమాత్రం లేదని ప్రజలు చెబుతున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకురావటానికే నేను పార్టీని స్థాపించానని అన్నారు.

Read more : Karimnagar : కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ హరీష్‌రావే: బండి సంజయ్

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంటు కోటలో షర్మిల భారీ సభ
2003లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర, 2004, 2009లో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని దివంగత చేవెళ్ల నుంచే ప్రారంభించారు. సీఎం హోదాలో పలు సంక్షేమ పథకాలనూ ఇక్కడినుంచే ప్రారంభించారు. అలా తండ్రి సెంటిమెంటు కోటలో.. షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. పాద్రయాత్ర సందర్భంగా నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి భారీగా జన సమీకరణ చేశారు పార్టీ నేతలు. సభా స్థలికి వైఎస్సార్‌ ప్రజాప్రస్థానంగా పేరు పెట్టారు. మరోవైపు షర్మిల పాదయాత్ర సందర్భంగా సెంటిమెంట్ చేవెళ్లలో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్ద వైఎస్‌, షర్మిల కటౌట్లు పెట్టారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఏమయ్యాయని కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు వైఎస్‌ షర్మిల.