Junior Lecturer, Drug Inspector Posts : జూనియర్ లెక్చరర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణలో జూనియర్ లెక్చరర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

TSPSC
Junior Lecturer, Drug Inspector Posts : తెలంగాణలో జూనియర్ లెక్చరర్, డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అభ్యర్థులు https:www.tspsc.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వీటిలో 27 సబ్జెక్టుల్లో మల్టీజోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులను భర్తీ చేస్తారు. టికి సంబంధించి ఈనెల 9న నోటిఫికేషన్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలలో పరీక్ష నిర్వహించనున్నారు.
KTR Wipro : తెలంగాణలో విప్రో యూనిట్ ప్రారంభం.. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే
అలాగే రాష్ట్రంలోని డ్రగ్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. 18 డ్రగ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు https:www.tspsc.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.