ఆ అధికారులు, బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో అరెస్ట్‌ టెన్షన్!

ఈ కుంభకోణం వెనుక మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట.

ఆ అధికారులు, బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో అరెస్ట్‌ టెన్షన్!

KTR

Updated On : November 8, 2024 / 9:47 PM IST

ఓ వైపు డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై అపోజిషన్‌ గళమెత్తుతోంది. అధికార కాంగ్రెస్‌ కూడా ఎదురుదాడి చేస్తూనే ఉంది. ఇదంతా పైకి కనిపిస్తున్న సీన్. కానీ తెరవెనక ప్రభుత్వం తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతుందట. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న హస్తం పార్టీ.. త్వరలో ఆ కథేంటో బయట పెట్టేందుకు రెడీ అవుతోందట. ఇందులో భాగంగా ముగ్గురు IAS ఆఫీసర్లు, ఒకరిద్దరు బీఆర్ఎస్ ముఖ్యనేతలను రౌండప్ చేసినట్లు టాక్. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ వర్గాల నుంచి లీకులు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.

బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అరెస్ట్ ఖయామంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్‌ నిధుల విడుదల విషయంలో కేటీఆర్ కార్నర్ అయిపోయారంటున్నారు. డైరెక్టుగా కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడంతో పాటు..తానెక్కడికి పారిపోలేదని చెప్తుండటం ఆసక్తికరంగా మారింది.

అరెస్ట్‌ చేస్తారని తెలిసే కేటీఆర్‌..ఓపెన్‌ అయిపోయారని..అసలు విషయం ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. సేమ్‌టైమ్‌ మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కూడా టార్గెట్‌ చేసినట్లు టాక్. గొర్రెల స్కీమ్‌లో గోల్‌మాల్‌ జరిగిదంటున్న కాంగ్రెస్ ఆ దిశగా ఆధారాలు సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది.

కేటీఆర్‌ టార్గెట్‌గానే పావులు కదులుతున్నాయా?
బీఆర్ఎస్‌ ముఖ్యనేతల అరెస్ట్ అంటూ ఊహాగానాలు వస్తుండటంతో మాజీ సీఎం కేసీఆర్‌ వరకు వ్యవహారం వెళ్తుందా..లేక కేటీఆర్‌ టార్గెట్‌గానే పావులు కదులుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ముఖ్యనేతలకు అరెస్ట్ భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేనికైనా సిద్ధంగా ఉన్నామని నేతలు స్టేట్‌మెంట్‌ ఇస్తుండటం చూస్తుంటే..ముందే అలర్ట్‌ అయ్యారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరోవైపు బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన ముగ్గురు IASల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ స్కామ్‌‌, ఫార్ములా ఈ- రేస్‌‌, భూ దందాలకు సంబంధించిన కేసుల్లో ముగ్గురు అధికారులపై దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. జీఎస్టీ స్కామ్‌లో మాజీ సీఎస్‌ సోమేశ్​కుమార్.. ఫార్ములా ఈ రేస్‌లో అరవింద్‌ కుమార్.. రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజ్‌గిరి జిల్లాల్లోని భూ స్కాముల్లో అమోయ్​కుమార్​విచారణ ఎదుర్కొంటున్నారు. బ్యూరోక్రాట్స్ కావడంతో న్యాయపరమైన చిక్కులు రాకుండా దర్యాప్తు సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయట.

బీఆర్ఎస్​ప్రభుత్వంలో సీఎస్‌‌‌‌గా సోమేశ్​కుమార్‌‌‌‌ అత్యంత కీలకంగా పనిచేశారు. ఆ టైమ్‌లో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రూ.వెయ్యి కోట్లకుపైగా కుంభకోణం జరిగినట్లు CCS‌‌‌ పోలీసులు లేటెస్ట్‌గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో సోమేశ్​కుమార్‌తో పాటు‌ అధికారులను నిందితులుగా చేర్చారు.

అరవింద్‌‌‌‌ చుట్టూ ఫార్ములా ఈ-కారు రేస్ కేసు
మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ అండ్‌‌‌‌ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ చుట్టూ ఫార్ములా ఈ-కారు రేస్ కేసు నడుస్తుంది. రూ.55 కోట్ల చెల్లింపులకు సంబంధించి అరవింద్​కుమార్​చుట్టే ఏసీబీ దర్యాప్తు జరుగుతోందట. ఆయన ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆధారంగానే నాటి మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన అమోయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూదందాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహేశ్వరం మండలం నాగారం రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 181లో 42 ఎకరాల 33 గుంటల భూమికి సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో అమోయ్​కుమార్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే ఈడీ మూడు రోజుల పాటు విచారించింది.

ఈ కుంభకోణం వెనుక మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయట. ఈ ముగ్గురు IASలే కాదు మరో ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లకు చిక్కులు తప్పవన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న.. అధికారులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు, వివరాల ఆధారంగానే బీఆర్ఎస్ ముఖ్యనేతలపై యాక్షన్‌ తీసుకోవడానికి అంతా రెడీ అవుతోందట. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారన్న ఉత్కంఠ కంటిన్యూ కొనసాగుతోంది.

కుప్పం, హిందూపురం మున్సిపాలిటీలపై టీడీపీ గురి.. చంద్రబాబు, బాలకృష్ణ మాస్టర్ ప్లాన్