Harish Rao : సీపీఎం ముఖ్య నేతలతో మంత్రి హరీశ్ రావు సమావేశం.. ఏం జరుగుతోంది?

Harish Rao Meets CPM Key Leaders : చింతా ప్రభాకర్ తో కలిసి సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని కోరారు.

Harish Rao : సీపీఎం ముఖ్య నేతలతో మంత్రి హరీశ్ రావు సమావేశం.. ఏం జరుగుతోంది?

Harish Rao Meets CPM Key Leaders

ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. సంగారెడ్డి సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయంలో పలువురు కమ్యూనిస్టు నేతలతో మంత్రి హరీశ్ రావు సమావేశం అయ్యారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో కలిసి సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి హరీశ్ రావు జిల్లాలో సీపీఎం పోటీ చేయని స్థానాలపై చర్చించారు. ఆయా స్థానాల్లో బీఆర్ఎస్ కు మద్దతివ్వాలని ఆయన కోరారు.

మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు సీపీఎం నేతలు. పార్టీలోని ఇతర ముఖ్య నాయకులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Also Read : తెలంగాణలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.. 80ఏళ్లు దాటిన ఓటర్లు ఎంతమంది అంటే?

ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో మంత్రి హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే కేవలం పటాన్ చెరులో మాత్రమే సీపీఎం పోటీ చేస్తోంది. ఇంకెక్కడా పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సీపీఎం మద్దతు కూడగట్టేందుకు మంత్రి హరీశ్ రావు స్వయంగా రంగంలోకి దిగారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ తో కలిసి ఆయన సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. సీపీఎం నేతలతో చర్చలు జరిపారు.

సీపీఎం అభ్యర్థులు పోటీ లేని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని సీపీఎం నాయకులకు విజ్ఞప్తి చేశారు మంత్రి హరీశ్ రావు. మంత్రి హరీశ్ రావుతో సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు, మల్లేశ్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. మద్దతు విషయంలో వారు సానూకలంగా స్పందించారు. రాష్ట్ర నాయకులతో చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని వారు మంత్రి హరీశ్ రావుతో చెప్పారు.

Also Read : గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న 43మంది అభ్యర్ధులు

గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో 10కి 10 సీట్లు కైవసం చేసుకోవాలనే వ్యూహాంతో బీఆర్ఎస్ ముందుకెళ్తోంది. అటు నర్సాపూర్ లో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేశ్ పాండే బీఆర్ఎస్ లో చేరారు. మొత్తంగా ఎత్తుకు పైఎత్తులతో, వ్యూహ ప్రతివ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వయంగా మంత్రి హరీశ్ రావు సీపీఎం పార్టీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నేతలతో చర్చలు జరపడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.