Defected MLAs : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. నెక్ట్స్ ఏం జరగనుంది?

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తోంది.

Defected MLAs : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. నెక్ట్స్ ఏం జరగనుంది?

Updated On : February 4, 2025 / 4:35 PM IST

Defected MLAs : కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటీసులు పంపారు. బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు పంపారు. అయితే, ఈ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరారు.

బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంపై గత వారం సుప్రీంకోర్టు కీలకమైన కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. ఫిరాయింపులకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.

వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలన్న ఎమ్మెల్యేలు..
ఈ నోటీసులపై కొందరు ఎమ్మెల్యేలు స్పందించారు. వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కొందరు ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపడం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్థానాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది.

Also Read : హైద‌రాబాద్‌ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి గుడ్‌న్యూస్‌.. మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు..! ఇంటివద్దనే ప్రశాంతంగా..

ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధం..
తొలుత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత పార్టీ మారిన ఏడుగురు ఎమ్మెల్యేలపైనా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.

అనర్హత పిటిషన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోరని చెప్పి సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో.. శాసనసభ కార్యదర్శి పంపిన నోటీసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పాలి. ఇది రాజకీయంగా అనేక ప్రకంపనలకు కారణమయ్యే అవకాశం ఉంది.

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి..
దీనిపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తోంది. అటు న్యాయపరంగా, ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి పెట్టింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నది బీఆర్ఎస్ ప్రధాన టార్గెట్ గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా సీరియస్ యాక్షన్ ప్లాన్ తో ముందుకెళ్తోంది.

Also Read : కులగణన, ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన.. కీలక విషయాలు వెల్లడి

అయితే, ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేలపై యాక్షన్ ఉంటుందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా స్పీకర్ పరిధిలోని అంశం. అనర్హత అంశంలో తుది నిర్ణయం స్పీకర్ దే. అసెంబ్లీ స్పీకర్ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.