Gaddar Funeral Controversy: గద్దర్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం సరికాదు.. ఆ విషయంపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం .. న్యాయపోరాటం చేస్తాం
రాజకీయ ప్రయోజనాలకోసమే గద్దర్ అంతక్రియలను ప్రభుత్వం అధికార లాంచనలతో జరిపిందని శశిధర్ ఆరోపించారు.

Gaddar Funeral Controversy
Gaddar Funeral: ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు ప్రభుత్వ అధికార లాంచనాలతో అంత్యక్రియలు చేయడం కరెక్ట్ కాదని, అధికార లాంచనాలతో అంతక్రియలు జరుపడాన్ని ATF (యాంటీ టెర్రరిజం ఫోరం) ఖండిస్తుందని ఆ సంస్థ కన్వీనర్ రావినూతల శశిధర్ అన్నారు. మావోయిస్టు సిద్ధాంతానికి వెన్నెముకగా గద్దర్ నిలిచాడని, ప్రజాస్వామ్యంను వ్యతిరేకించిన వ్యక్తి గద్దర్ అని అన్నారు. అదే ప్రజాస్వామ్యంలో పనిచేసే అధికారులతో ఏ విధంగా అంతక్రియలు జరుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమాజంలో శాంతి నెలకొల్పిన పోలీసుల త్యాగాలు ప్రభుత్వానికి కనబడం లేదా అని ప్రశ్నించారు.
Gaddar Funeral: గద్దర్ అంతిమయాత్రలో తొక్కిసలాట.. గద్దర్ స్నేహితుడి మృతి
వ్యక్తి మరణం గురించి ఆరోపించడం లేదు. ప్రజాస్వామ్యంను కూకటివేళ్ళతో పెకిలిస్తామని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామని చెప్పిన సిద్ధంత వాది గద్దర్. మావోయిస్టు కాల్పుల్లో అనేక మంది పోలీసులు అమరులయ్యారు. ప్రజా ప్రతినిధులు కూడా చాలా మంది మావోయిస్టు చేతిలో చనిపోయారు. ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రి, రిటైర్డ్ జడ్జ్‌లు వెళ్లి నివాళులు అర్పించడం ATF వ్యతిరేకిస్తుందని రావినూతల శశిధర్ అన్నారు. సిద్ధాంత పరంగా ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గద్దర్‌ను నేను వ్యక్తి గతంగా చూడడం లేదని, గద్దర్ భావాలను, అతని సిద్ధాంతాలను వ్యతిరేకస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యంకు తీరని మచ్చ.. ఇదే విషయంపై రాష్ట్రపతికి లేఖ రాస్తున్నామని చెప్పారు.
రాజకీయ ప్రయోజనాలకోసమే గద్దర్ అంతక్రియలను ప్రభుత్వం అధికార లాంచనలతో జరిపిందని శశిధర్ ఆరోపించారు. సోమవారం జరిగిన సంఘటనతో మావోయిస్టు సిద్ధాంతంను అన్ని పార్టీలు పరోక్షంగా మద్దతు పలికినట్టేనని అన్నారు. నిషేధంలో ఉన్న మావోయిస్టు పార్టీలో ఉండి లొంగిపోయిన వారికి అధికార లాంచనలతో అంతక్రియలు చెయ్యడం సరైంది కాదని అన్నారు. ప్రజాస్వామిక వాదులు అందరు ఆలోచించాలని, ఒక స్పష్టమైన గైడ్ లెన్స్ తీసుకురావాలని రాష్ట్రపతికి లేఖ రాస్తామని శశిధర్ చెప్పారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.