చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. టీటీడీపీ బలోపేతానికి ఏపీ సీఎం కీలక నిర్ణయాలు

తెలంగాణలో పార్టీకి సంబంధించి అన్ని కమిటీలను రద్దు చేశామని, త్వరలో పార్టీ సభ్యత్వం చేపడదామని అన్నారు.

చంద్రబాబును కలిసిన బాబు మోహన్.. టీటీడీపీ బలోపేతానికి ఏపీ సీఎం కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు. చంద్రబాబుని సినిమా యాక్టర్, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ కలిశారు. త్వరలో బాబు మోహన్ టీడీపీలో చేరే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడితో భేటీలో భావోద్వేగానికి గురయ్యారు బాబు మోహన్.

కాగా, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో చంద్రబాబు ఫొటోలు దిగారు. భారీ ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. అందరినీ కలవాలన్న ఉద్దేశంతో పార్టీ ఆఫీసుకి వచ్చానని చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అని, తెలుగువారు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందని తెలిపారు.

తెలంగాణలో పార్టీకి సంబంధించి అన్ని కమిటీలను రద్దు చేశామని, త్వరలో పార్టీ సభ్యత్వం చేపడదామని అన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2047 వరకు తెలుగు వాళ్లు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తెలంగాణకు వస్తానని, పార్టీ ని ప్రజలోకి తీసుకెళ్లాలని నేతలకి చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వంపై తక్షణమే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని నాయకులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా అడహక్ కమిటీలు వేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

Also Read: ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున ‘బిగ్ బాస్’కే బాస్.. ఆ డబ్బంతా ప్రభుత్వం కక్కించాలి: సీపీఐ నారాయణ