తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఫైనాన్షియర్ ఇంటిని తగులబెట్టిన బాధితులు.. ఉద్రిక్తత
అమాయక గిరిజనులే బాలాజీ నాయక్ టార్గెట్‌గా మారారు. గతంలోనూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.

Balaji Nayak House
Balaji Nayak House: నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం పలుగుతండాలో బడా ఫైనాన్షియర్ బాలాజీ నాయక్ ఇంటి మీద దాడి జరిగింది. అతడి ఇంటిని తగలబెట్టారు.
బాలాజీ నాయక్‌కు మిర్యాలగూడ సమీపంలోని ఓ తండాకు చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వగా.. డబ్బులు రిటర్న్ ఇవ్వకపోవడంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో బాలాజీ నాయక్ ఇంటిపై మృతుడి కుటుంబ సభ్యులు దాడి చేసి తగలబెట్టారు.
Also Read: రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీగా పెరిగి, రికార్డు స్థాయికి..
అధిక వడ్డీ ఆశ చూపి వందల కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా బాలాజీ నాయక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బుతో బాలాజీ నాయక్ జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయక గిరిజనులే బాలాజీ నాయక్ టార్గెట్‌గా మారారు. గతంలోనూ జిల్లా కలెక్టర్, ఎస్పీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.