Bandi Sanjay Flexies: వరంగల్‌లో బండి సంజయ్ ప్లెక్సీల కలకలం.. సంజయ్ చెప్పులు మోస్తున్నట్లు ఫొటోలు మార్ఫింగ్
వరంగల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నట్లుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Bandi Sunjay
Bandi Sanjay Flexies: వరంగల్ జిల్లాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పులు మోస్తున్నట్లుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. సంజయ్ ఫోటో పక్కనే ‘ నేను ఢిల్లీ గులాములకు చెప్పులు మోసే బానిసని’ అంటూ రాశారు. ఈ ఫ్లెక్సీ వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్ లో వెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ స్థానిక నేతలు ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఇదంతా టీఆర్ఎస్ పార్టీలోని వ్యక్తుల పనేనంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay Protest: నిరసన దీక్షకు దిగిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన పలు కార్యక్రమాలతో పాటు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఓ కార్యక్రమం సమయంలో అమిత్ షా చెప్పులు బండి సంజయ్ పట్టుకోవటం రాజకీయ దుమారం రేగింది. బండి సంజయ్ ఢిల్లీ గులాములకు చెప్పులు మోసే బానిస అంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Bihar : బీహార్ లో నితీశ్ కుమార్ బలపరీక్షకు ముందే..స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా రాజీనామా
బండి సంజయ్ మాత్రం అమిత్ షాకు చెప్పులు అందివ్వడాన్ని సమర్ధించుకున్నారు. అమిత్ షా నాకు గురువులాంటి వారని, అప్పుడు ఆయనకు చెప్పులు అందివ్వడంలో తప్పేంటంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఈ వివాదం సర్దుమణుగుతున్న సమయంలో వరంగల్ లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం కలకలం రేపాయి.