Bandi Sanjay Protest: నిరసన దీక్షకు దిగిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలకు పాల్పడుతోందంటూ కరీంనగర్‌లోని తన నివాసం వద్ద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నీ బిడ్డకు అండదండలా? నీ దమన నీతిపై పోరాడే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అరెస్టులు, నిర్బంధాలా? పరాకాష్ఠకు చేరిన నీ నియంతృత్వాన్ని గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని యాదుంచుకో దొరా.. నీ అవినీతి పాలన సాలు దొర. నీ అరాచకాలకు సెలవు దొర’ అంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ ట్వీట్ చేశారు.

Bandi Sanjay Protest
Bandi Sanjay Protest: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు, దాడులు, నిర్బంధాలకు పాల్పడుతోందంటూ కరీంనగర్‌లోని తన నివాసం వద్ద బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. ‘అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నీ బిడ్డకు అండదండలా? నీ దమన నీతిపై పోరాడే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అరెస్టులు, నిర్బంధాలా? పరాకాష్ఠకు చేరిన నీ నియంతృత్వాన్ని గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని యాదుంచుకో దొరా.. నీ అవినీతి పాలన సాలు దొర. నీ అరాచకాలకు సెలవు దొర’ అంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ ట్వీట్ చేశారు.
కాగా, బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారంటూ స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని పాంనూరులో బండి సంజయ్ నిన్న చేపట్టిన ధర్మదీక్షను భగ్నం చేసిన పోలీసులు కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం వరకు ఆయన గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి దీక్షకు దిగారు. మరోవైపు, హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ పలువురు ఆ పార్టీ నేతలు దీక్షకు దిగారు. లక్ష్మణ్, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జీవితా రాజశేఖర్, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు.
Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..