Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాల ప్రభావం తెలంగాణపై పక్కా ఉంటుంది: బండి సంజయ్‌

రాబోయే రోజుల్లో తెలంగాణలో అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాల ప్రభావం తెలంగాణపై పక్కా ఉంటుంది: బండి సంజయ్‌

Bandi Sanjay

Updated On : November 23, 2024 / 4:24 PM IST

ఇండియా కూటమి అబద్ధాలను ప్రజలు నమ్మలేదని, అందుకే మహారాష్ట్రలో ఆ కూటమి ఓడిపోయిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఫలితాల ప్రభావం తెలంగాణపై పక్కా ఉంటుందని చెప్పారు.

కాంగ్రెస్‌లో లుకలుకలు ప్రారంభం అవుతాయని బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రెస్ లోనే అసమ్మతి ఉందని, ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. కూల్చాలనే ఉద్దేశం తమకు లేదని, వారే కూల్చుకుంటారని అన్నారు.

మహారాష్ట్రలో ఎన్డీఏ విజయ దుందుభి మోగించిందని, కాంగ్రెస్ పార్టీ ఐరన్ లెగ్ పార్టీగా మారిందని బండి సంజయ్‌ చెప్పారు. ఇండియా కూటమి అబద్ధాలను ప్రజలు నమ్మలేదని, హిందూ సమాజం చైతన్యాన్ని మహారాష్ట్ర చాటి చెప్పిందని తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఐక్యతనే ఎన్డీయే కూటమి విజయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ, కర్ణాటక నుంచి వేల కోట్లు పంపిణీ చేశారని ఆరోపించారు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు ప్రజలు గ్రహించారని బండి సంజయ్‌ అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అదే పరిస్థితి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు చేస్తారా? లేదా? లేకుంటే ప్రజలు తిరగబడక తప్పదని హెచ్చరించారు. ఈవీఎంల ట్యాపరింగ్ అయితే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వస్తుందని నిలదీశారు.

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమాధానం ఇదే..