మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమాధానం ఇదే..

దీనిపై ఎలాంటి వివాదం ఉండదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సమాధానం ఇదే..

Updated On : November 23, 2024 / 4:07 PM IST

మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘనవిజయం దిశగా దూసుకుపోతుండడంతో ఆ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మీడియా ఇదే ప్రశ్న అడిగింది. దీంతో ఆయన మాట్లాడుతూ… “సీఎం అంశంలో ఎలాంటి వివాదాలు ఉండవని, ఎన్నికల తర్వాత మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించుకోవాలని మొదటే నిర్ణయించాం. మేము తీసుకునే నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. దీనిపై ఎలాంటి వివాదం ఉండదు” అని అన్నారు.

సంజయ్‌ రౌత్ చేస్తున్న వ్యాఖ్యలపై ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా.. తాను సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సాధారణంగా స్పందించనని తెలిపారు. కానీ అది అవసరం కాబట్టి ఈ రోజు రియాక్ట్ అవుతున్నానని అన్నారు. ఝార్ఖండ్‌ ఎన్నికల్లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా గెలిచిందని, చట్టబద్ధమైన పద్ధతిలో విజయం సాధించిందని తనకు తెలుసని చెప్పారు.

అక్కడ ఎన్నికలు పూర్తిగా నిష్పక్షపాతంగా జరిగాయని, అక్కడ ఎన్నికల సంఘం మంచి పని చేసిందని అన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం గెలిచిందని, ఈవీఎంలు సరిగ్గా పనిచేశాయని కొందరు అంటున్నారని చెప్పారు. మహారాష్ట్రలో మాత్రం మహాయుతి భారీ విజయం సాధిస్తే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇక్కడ ఈవీఎంలు హ్యాక్‌కు గురయ్యాయని అంటున్నారని, ఇక్కడ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అంటున్నారని చెప్పారు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మహారాష్ట్రలో ప్రజలు తమ తీర్పుని ఇచ్చారని, ఏక్‌నాథ్ షిండేదే నిజమైన శివసేనగా అంగీకరించారని అన్నారు. అలాగే, అజిత్ పవార్‌కు ఎన్సీపీకి సంబంధించి చట్టబద్ధత లభించిందని చెప్పారు.

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిపై విమర్శలు ..