Bandi Sanjay: రేపటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది.

Bandi Sanjay
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది. ఈ యాత్ర ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్న పేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. మొత్తం 24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలో మీటర్ల మేర సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతుంది.
Bandi Sanjay : కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు-బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రేపటి నుంచి మూడవ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా బండి సంజయ్ సోమవారం మహాశక్తి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. ప్రజలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామన్నారు. రెండు సార్లు యాత్రలు విజయవంతం అయ్యాయని తెలిపారు. కేంద్ర మంత్రులు, నాయకులు హాజరయ్యారని అన్నారు. మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఇలవేల్పు అయిన యాదాద్రి నుంచి మొదలవుతుందని సంజయ్ అన్నారు.
Bandi Sanjay : టీఆర్‌ఎస్‌లో చాలా మంది షిండేలు : బండి సంజయ్
గతేడాది ఆగస్టు 28న హైదరాబాద్ ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి తొలి విడత ప్రజా సంగ్రామ యాత్రను సంజయ్ ప్రారంభించారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను గద్వాల జిల్లా అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించారు. తాజాగా మూడవ విడత పాదయాత్రను యాదగిరి గుట్ట నుంచి మొదలు పెట్టనున్నారు.