Bandi Sanjay : టీఆర్‌ఎస్‌లో చాలా మంది షిండేలు : బండి సంజయ్‌

కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని... ఇక తాము కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని సంజయ్‌ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడని దుయ్యబట్టారు.

Bandi Sanjay : టీఆర్‌ఎస్‌లో చాలా మంది షిండేలు : బండి సంజయ్‌

Bandi Sanjay

Bandi Sanjay : సీఎం కేసీఆర్‌ విమర్శలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌లోనూ చాలా మంది ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ తన రెండు గంటల మీడియా సమావేశంలో వందసార్లు షిండే గురించి ప్రస్తావించారని, దీన్నిబట్టే టీఆర్‌ఎస్‌లో ఏదో జరుగుతోందని ప్రజలు గుర్తించారన్నారు. టీఆర్‌ఎస్‌లో ఎవరు షిండేలో తెలుసుకోవాలని బండి సంజయ్‌ సూచించారు. సీఎం కేసీఆర్‌ చేసిన తప్పులను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.

సీఎం మాటలకు భయపడే పార్టీ బీజేపీ కాదని… స్పష్టం చేశారు. సీఎం ప్రస్తుతం కుంగుబాటులో ఉన్నారని…. ఆయన ముఖ కవళికల్లో తేడా కన్పిస్తోందని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, నాయకులు కూడా తలచుకోనంతగా ఏక్‌నాథ్‌ షిండేను కేసీఆర్‌ గుర్తుకు చేసుకుంటున్నారని… బహుశా ఆయన కుటుంబంలోనో, పార్టీలోనో కొందరు షిండేలుగా మారుతున్నట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. అది తెలిసి బీజేపీపై అభాండాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు.

Telangana BJP: నేడు క‌రీంన‌గ‌ర్‌లో బండి సంజ‌య్ మౌనదీక్ష‌.. ఎందుకంటే..

కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే సిద్ధంగా ఉన్నారని… ఇక తాము కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని సంజయ్‌ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చిన మూర్ఖుడని దుయ్యబట్టారు. కృష్ణా జలాలను ఏపీ దోచుకుపోతుంటే ఎందుకు మాట్లాడ్డం లేదని నిలదీశారు.

కేసీఆర్‌ నియంత, అవినీతి, కుటుంబ పాలనను అసహ్యించుకుని ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపించారని వివరించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ రోజురోజూ పడిపోతుంటే బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోందన్నారు. రాష్ట్రంలోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని కేసీఆర్‌… దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. దమ్ముంటే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని ఓడించాలని సవాల్‌ చేశారు.