నటి హేమకు మరో బిగ్‌షాక్‌.. 27న విచారణకు రావాలంటూ నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా నటి హేమకు నోటీసులు ఇచ్చారు.

నటి హేమకు మరో బిగ్‌షాక్‌.. 27న విచారణకు రావాలంటూ నోటీసులు

Bangalore Rave Party Case

Bangalore Rave Party Case : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తాజాగా నటి హేమకు నోటీసులు ఇచ్చారు. సోమవారం (ఈనెల 27న) విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను వాడినట్లు గుర్తించిన పోలీసులు.. పార్టీలో పట్టుబడిన హేమతోపాటు మొత్తం 103 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. నటి హేమ శాంపిల్స్ రిపోర్టులో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. హేమతోపాటు మరో 86 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో బెంగళూరు క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని వారందరికీ నోటీసులు ఇచ్చారు. హేమను సోమవారం విచారణ రావాలని నోటీసుల్లో పేర్కొనగా.. మిగిలిన వారికి వేరువేరు తేదీల్లో విచారణ కు రావాలని నోటీసులు ఇచ్చారు.

Also Read : Bangalore Rave Party: వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదోవ పట్టించిన హేమ!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేను పాల్గోలేదని నటి హేమ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే, పోలీసులు మాత్రం పార్టీలో హేమకూడా పాల్గొందని, ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పంపించామని చెప్పారు. కానీ, హేమ మాత్రం నేనే రేవ్ పార్టీకి వెళ్లలేదు.. హైదరాబాద్ లోనే ఉన్నానని ఒకరిసారి, ఇంట్లో వంట చేస్తూ మరోసారి వీడియోలను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆమె నుంచి సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలినట్లు బెంగళూరు పోలీసులు చెప్పడం, ఈనెల 27న విచారణకు రావాలని ఆమెకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే, మొదటి నుంచి నేను రేవ్ పార్టీలో పాల్గొనలేదని బుకాయిస్తూ వస్తున్న నటి హేమ ఈనెల 27న బెంగళూరు క్రైం బ్రాంచ్ ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా అనే విషయం ఉత్కంఠగా మారింది.

Also Read : బెంగళూరు రేవ్ పార్టీతో కాకాని, సోమిరెడ్డి మధ్య డైలాగ్ వార్

మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కాకాని గోవర్ధన్ కారు స్టిక్కర్ వాడిన వ్యక్తిని గుర్తించారు. పూర్ణ రెడ్డి అనే వ్యక్తి ఆ కారును వాడినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన రోజు పోలీసులు రావడంతో ఆ కారును వాడిన పూర్ణ రెడ్డి.. కారును అక్కడే వదిలేసి ఫామ్ హౌస్ నుంచి పరారైనట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం పూర్ణ రెడ్డిని బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.