DAV School Reopen : ఎట్టకేలకు DAV స్కూల్ రీ-ఓపెన్, అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. విద్యార్థుల భద్రత మరింత కట్టుదిట్టం
ఎట్టకేలకు విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం ఫలించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ-ఓపెన్ కానుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రేపటి నుంచి స్కూల్ రీ-ఓపెన్ కానుంది. రేపు ఉదయం యధావిధిగా పాఠశాల ప్రారంభం కాబోతోంది.

DAV School Reopen : ఎట్టకేలకు విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటం ఫలించింది. హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ-ఓపెన్ కానుంది. డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో రేపటి నుంచి స్కూల్ రీ-ఓపెన్ కానుంది. రేపు ఉదయం యధావిధిగా పాఠశాల ప్రారంభం కాబోతోంది.
గతంలో జరిగిన పొరపాట్లకు తావు ఇవ్వకుండా స్కూల్ యాజమాన్యం భద్రతకు పెద్ద పీట వేసింది. నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యార్థులకు భద్రత కల్పించనుంది స్కూల్ యాజమాన్యం.
డీఏవీ పబ్లిక్ స్కూల్ లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్ రజనీకుమార్ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
అయితే విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల గుర్తింపు రద్దు చేయడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, స్కూల్ రీఓపెన్ చేయాలని తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. తల్లిదండ్రుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం స్కూల్ ను తిరిగి తెరవాలని నిర్ణయించింది.
డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది విద్యాశాఖ.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే స్కూల్ ను కొనసాగించవచ్చని చెప్పింది. అలాగే, తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
స్కూల్ ప్రిన్సిపాల్ గదికి పక్కనే దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ మాధవిపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.