K Keshava Rao : రూ.2కోట్ల విలువైన భూమి రూ.3లక్షలకే అమ్మకం, బీఆర్ఎస్ ఎంపీ కేకే కుమారులపై ఫోర్జరీ కేసు
ఎన్నారై జయమాలకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వెళ్లింది. రూ.2.13 కోట్లు ఫైన్ విధించింది ఐటీ డిపార్ట్ మెంట్. (K Keshava Rao)

K Keshava Rao(Photo : Google)
K Keshava Rao Sons : బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు కుమారులపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఒక మహిళా ఎన్నారై సంతకాన్ని కేకే కుమారుల ఫోర్జరీ చేశారని పోలీసులు తెలిపారు. కేకే కొడుకులు విప్లవ్ కుమార్, వెంకటేశ్వరరావుపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఎన్నాఆర్ఐ జయమాల(72) సంతకాన్ని కేకే కుమారులు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేకే కుమారులపై మహిళా ఎన్ఆర్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ లోని తన స్థలాన్ని ఆక్రమించారని ఆమె పోలీసులను ఆశ్రయించారు. కొన్నిరోజుల క్రితమే ఈ వ్యవహారం జరిగింది. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో 2 సర్వే నెంబర్ లో భూములు ఉన్నాయి. ఆ భూములను ఎన్ఆర్ఐ తమకు అమ్మినట్టు సేల్ డీడ్ క్రియేట్ చేశారు కేకే కుమారులు. 2013లో సేల్ డీడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు విప్లవ్, వెంకటేశ్వర రావు. కాగా, ఆ భూముల మార్కెట్ విలువ రూ.2.13 కోట్లు ఉంటే 3 లక్షలకే అమ్మినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. దీంతో ఎన్నారై జయమాలకు ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వెళ్లింది. కోటి రూపాయల ఫైన్ విధించింది ఐటీ డిపార్ట్ మెంట్.
తనకు ఐటీ శాఖ అంత పెద్ద మొత్తం ఫైన్ విధించడంతో జయమాల షాక్ కి గురయ్యారు. ఆ తర్వాత అసలేం జరిగిందో తెలుసుకుని మరింత నివ్వెరపోయారు. తన సంతకం ఫోర్జరీ చేశారని గ్రహించి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారామె. అయితే, పోలీసులు పట్టించుకోలేదు. దాంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టు రిఫరెన్స్ తో బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశారు. కేకే కుమారులు విప్లవ కుమార్, వెంకటేశ్వరరావులపై చీటింగ్ కేసుతో పాటు 7 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
ఎన్నారై జయమాలకు ఐటీ శాఖ నుంచి నోటీసులు రావడంతో అసలు విషయం బయటికి వచ్చింది. గతేడాది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లోని జయమాల నివసించిన ఇంటికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ అయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2కోట్ల 13లక్షలకు స్థలాన్ని విక్రయించారని పేర్కొన్నారు. పెట్టుబడి మీద వచ్చిన లాభానికి సంబంధించి పన్ను, పెనాల్టీ రూపంలో రూ.కోటి 40లక్షలు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.