డీజే ఎఫెక్ట్.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై కేసు నమోదు..
మేయర్ తో పాటు నిర్వాహకులపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.

Police Case On Gadwal Vijayalakshmi (Photo Credit : Google)
Police Case On Gadwal Vijayalakshmi : హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదైంది. బతుకమ్మ కార్యక్రమంలో డీజేలకు అనుమతించిన దానికంటే అధిక డెసిబుల్ సౌండ్ పెట్టినందుకు మేయర్ పై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి శబ్ద కాలుష్యానికి పాల్పడ్డారని మేయర్ తో పాటు నిర్వాహకులపైన కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.
డీజే సౌండ్ బాక్స్ ల వినియోగంపై హైదరాబాద్ పోలీసులు నిషేదం విధించిన సంగతి తెలిసిందే. డీజే సౌండ్ బాక్సులు.. భారీ శబ్ద కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదంగా మారాయి. దానికి తోడు డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు, హార్ట్ పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపుల్లో డీజే సౌండ్స్ వినియోగించకూడదని ఆదేశాలిచ్చారు.
ఇక, ఏపీలోని అమలాపురంలో దసరా పండుగ రోజున డీజే కారణంగా తీవ్ర విషాదం అలుముకుంది. డీజే సౌండ్ బాక్సుల ముందు డ్యాన్స్ చేస్తున్న 21 ఏళ్ల వినయ్.. గుండెపోటుతో మరణించాడు. దీంతో పండుగ పూట వినయ్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. డీజే సౌండ్స్ బాక్స్ నుంచి వచ్చిన భారీ శబ్దాల కారణంగా గుండె లయ తప్పి కార్డియాక్ అరెస్ట్ దారితీసిందని డాక్టర్లు చెబుతున్నారు. దాంతో వినయ్ చనిపోయాడని తెలిపారు. అందుకే.. డీజే సౌండ్ బాక్సులతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
Also Read : సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ.. గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత