Konda Surekha: సీఐ కుర్చీలో మంత్రి కొండా సురేఖ.. గీసుకొండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లిపోయింది గీసు గొండ పోలీస్ స్టేషన్.

Konda Surekha
వరంగల్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పరకాల నియోజకవర్గంలో కొండా మురళి వర్గం వర్సెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అనుచరుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. బతుకమ్మ-దసరాకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో రేవూరి ప్రకాశ్ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం చెలరేగింది.
కొండా మురళీ ఫ్లెక్సీలను రేవూరి ప్రకాశ్ రెడ్డి అనుచరులు చించేశారు. రేవూరి ప్రకాశ్ రెడ్డి-కొండా మురళీ వర్గీయులు ఘర్షణ చెలరేగడంతో కొందరు గాయపడ్డారు. గీసుగొండ పోలీసులు తమ వారిని అదుపులోకి తీసుకుని చేయి చేసుకున్నారని కొండా వర్గీయులు ఆరోపిస్తున్నారు.
కొండా వర్గీయులను విడుదల చేయాలని ధర్మారం రైల్వే గేట్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో గీసుగొండ పోలీస్ స్టేషన్ కు మంత్రి కొండా సురేఖ వెళ్లారు. కొడా సురేఖ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆమె సీఐ కుర్చీలో కూర్చొని పోలీసులను వివరణ అడిగారు. పోలీస్ స్టేషన్ కొండా వర్గీయులు భారీగా చేరుకున్నారు. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారని కొండా సురేఖ ప్రశ్నించారు.
కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లిపోయింది గీసు గొండ పోలీస్ స్టేషన్. ఘటనపై కొండా సురేఖ పోలీసులను వివరణను అడిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ స్టేషన్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేరుకున్నారు. ఆయన హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి మంత్రి కొండా సురేఖ వెళ్లిపోయారు.
బాబోయ్.. ఉడిపి హోటల్ ఇడ్లీలో జెర్రి..! షాక్‌లో కస్టమర్…