Basara Triple IT : ఫలించిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి పోరాటం
Basara Triple IT : హైకోర్టు ఆదేశాల మేరకు సామల ఫణి కుమార్ అనే విద్యార్థికి ట్రిపుల్ ఐటీ అధికారులు సర్టిఫికెట్లు అందించారు.

Basara Triple IT Releases Certificates
Basara Triple IT : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి పోరాటం చివరికి ఫలించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సామల ఫణి కుమార్ అనే విద్యార్థికి ట్రిపుల్ ఐటీ అధికారులు సర్టిఫికెట్లు అందించారు. అధికారులు సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వడంతో విద్యార్థులు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ఫీజు బకాయి వల్ల ఫణి కుమార్ సర్టిఫికెట్లను ఐటీ అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి సామల ఫణి కుమార్ కోర్టును ఆశ్రయించారు. 7 నెలల నుంచి సర్టిఫికెట్ల కోసం యూనివర్సిటీ చుట్టూ తిరిగానని ఫణి కుమార్ స్పష్టం చేశారు.
ఇంకా చాలామంది సర్టిఫికెట్లు యూనివర్సిటీలోనే ఉన్నాయని విద్యార్థి ఫణి కుమార్ తెలిపారు. ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై బాసర ట్రిపుల్ ఐటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై హైకోర్టులో విచారణ అనంతరం ట్రిపుల్ ఐటీ అధికారులను విద్యార్థులకు సర్టిఫికేట్లు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
Read Also : JEE Mains 2025 Schedule : జేఈఈ మెయిన్స్ 2025 షెడ్యూల్ ఇదిగో.. మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం!