Road Safety : వణుకు పుట్టించే వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్.. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త..

టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Road Safety : వణుకు పుట్టించే వీడియో షేర్ చేసిన వీసీ సజ్జనార్.. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త..

VC Sajjanar

Updated On : February 14, 2024 / 8:08 AM IST

VC Sajjanar : మనం చేసేపనిలో ఏ మాత్రం ఏమరపాటుగాఉన్నా మనకైనా, ఇతరుల ప్రాణాలకైనా ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రోడ్డుపై వాహనాలు నడిపే సమయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ప్రస్తుత కాలంలో కార్లు కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తిచూపుతున్నారు. దీంతో కార్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే, కారుఉన్న వారు తగిన జాగ్రత్తలు పాటించాలి. కారు రోడ్డుపక్కన నిలిపినప్పుడు డోర్ తీసే సమయంలో ముందూవెనుక రోడ్డుపై ఎవరైనా వస్తున్నారా అని చూసుకోవాలి. అలాకాకుండా, సడన్ గా కారు డోర్ తీస్తే ఒక్కోసారి రోడ్డుపై ప్రయాణించే వారికి హానితలపెట్టినవారు అవుతారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : Florida Plane Crash : హైవేపై కుప్పకూలిన విమానం.. కూలిపోతున్న సమయంలో తీసిన వీడియో వైరల్

టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిత్యం రోడ్డు సేప్టీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తుంటారు. వాహనాలు నడిపే సమయంలోనూ ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేకుంటే ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయనే విషయాలను తెలియజేసే వీడియోలను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ప్రతీఒక్కరిలో అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా, సజ్జనార్ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే.. మనంచేసే చిన్నపాటి నిర్లక్ష్యానికి ఇతరులకు ఏ స్థాయిలో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో తెలిసిపోతుంది.

Also Read : Viral Video : బండిని ఆపాడ‌ని.. ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలు కొరికిన వ్య‌క్తి!

సజ్జనార్ ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. రద్దీగా ఉండే ఏరియాలో రోడ్డుపై ఓ వ్యక్తి కారు పార్కింగ్ చేశాడు. దానికి పక్కనే ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. కారు, ఆయిల్ ట్యాంకర్ మధ్య గ్యాప్ లో నుంచి మోటార్ సైకిల్ పై వాహనదారుడు వెళ్తున్నాడు.. ఇదే సమయంలో వెనకాముందు చూసుకోని కారులోని వ్యక్తి ఒక్కసారిగా కార్ డోర్ తీస్తాడు.. ఆ డోర్ తగిలి బైక్ పై వెళ్తున్న వ్యక్తి కిందపడటంతో వెనుకాలే వస్తున్న ఆయిల్ ట్యాంకర్ కిందపడిన వ్యక్తిపైకి వెళ్తుంది. అదృష్టం బాగుండి ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.