Bhadrachalam: భద్రాచలంలో బిల్డింగ్ కూలి ఘటనలో ఒకరు మృతి.. శిథిలాల కింద ఒక మహిళ, మరో ముగ్గురు..? కొనసాగుతున్న సహాయక చర్యలు..
భద్రాచలం పట్టణంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. పది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ తరువాత ..

Bhadrachalam Building Collapsed Incident
Bhadrachalam Building Collapsed Incident: భద్రాచలం పట్టణంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో భవనం కూలిన విషయం విధితమే. దీంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ తరువాత కామేశ్ అనే వ్యక్తిని శిథిలాల నుంచి బయటకు తీశారు. అయితే, అతను చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
Read Also: Shasta Graha Kutami 2025 : 29న షష్టగ్రహ కూటమి.. ఆ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..
తెల్లవారుజామున రెండు గంటల సమయంలో శిథిలాల కింద చిక్కుకున్న కామేశ్ ను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు. రెస్క్యూలో ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ టీమ్ పాల్గొన్నాయి. ఆక్సిజన్ అందిస్తూ, పిల్లర్ల మధ్యలో ఇసుకను తొలగిస్తూ కామేశ్వరరావును బయటకు తీసుకొచ్చారు. హుటాహుటీన అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఐదంతస్తుల స్లాబు మీద పడడంతో అతని కాళ్లు, చేతులు నుజ్జునుజ్జు అయ్యాయి. అయితే, అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Read Also: Solar Eclipse 2025 : సూర్యగ్రహణం ఎప్పుడు? ఎన్ని గంటలకి? మనకి ప్రభావం ఉందా? ఏం చేయాలి? ఏం చేయొద్దు?
భవనం కూలిన ప్రదేశంలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని త్వరగా బయటకు తీయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ను అడ్డుకొని తీవ్ర స్థాయిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. భవన యాజమానిని పోలీసులు దాచిపెట్టారంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో బాధితు కుటుంబాల రోధనలతో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ వారికోసం కన్నీరుమున్నీరవుతూ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
కూలిన స్లాబ్ కిందకు కుంగిపోకుండా జాకీలను ఉంచారు. భవనం శిథిలాల కింద ఒక మహిళ, మరో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.