Shasta Graha Kutami 2025 : 29న షష్టగ్రహ కూటమి.. ఆ రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..
షష్ట గ్రహ కూటమి కారణంగా వచ్చే చిక్కులు ఏంటి? షష్ట గ్రహ కూటమి ప్రమాదకరమా? భయోత్పాతాలు కలిగించేదా?

Shasta Graha Kutami 2025 : మార్చి 29న సూర్యగ్రహణం ఏర్పడనుంది. అదే రోజున షష్ట గ్రహ కూటమి ఉంటుందని పండితులు చెబుతున్నారు. షష్ట గ్రహ కూటమి చాలా అరుదైన అంశం. మీన రాశిలో ఈ సంవత్సరానికే ప్రత్యేకం. షష్ట గ్రహ కూటమి అనేది నిర్దిష్ట రాశిలో ఆరు గ్రహాలైన రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువు కలయిక ద్వారా ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఒకే కక్ష్యలోకి 6 రాశులు రావడం అరిష్టం అని, విధ్వంసం తప్పదని కొందరు పేర్కొంటున్నారు.
షష్ట గ్రహ కూటమి కారణంగా వచ్చే చిక్కులు ఏంటి? షష్ట గ్రహ కూటమి ప్రమాదకరమా? భయోత్పాతాలు కలిగించేదా? ప్రపంచమంతా తలకిందులు కానుందా? ప్రళయం రాబోతోందా? భూకంపాలు రాబోతున్నాయా? చంద్రుడు, రాహువు, శని, రవి, బుధుడు, శుక్ర గ్రహంతో ఏర్పడేటటువంటి ఈ షష్ట గ్రహ కూటమి కాసేపు మాత్రమే.
”గ్రహకూటమి అంటే.. ఒకే రాశిలో అన్ని గ్రహాలు కలిసి ఉండటాన్ని గ్రహకూటమి అంటారు. అభద్రతా భావం అన్ని దేశాల్లో పెరుగుతుంది. ధనం సమృద్ధిగా దొరుకుతుంది. అలాగే ధనం సమృద్ధిగా ఖర్చు అవుతుంది. ఈ సమయ కాలంలో ప్రపంచంలో కొత్త కొత్త వింతలు జరుగుతాయి. మార్చి 30న ఉగాది వస్తుంది. విశ్వావసు సంవత్సరంలో మొదటి అర్థం భాగం ఇబ్బందే ఉంటుంది.
Also Read : ఇక పండగ చేస్కోండి.. కొత్త IPTV సర్వీసు సూపర్ ప్లాన్లు ఇవే.. ఫ్రీగా OTT యాప్స్, 350 టీవీ ఛానల్స్ చూడొచ్చు!
వచ్చినటువంటి డబ్బుని ఈ మధ్య కాలంలో అవనసరమైన ఖర్చులు చేయరాదు. అప్పు చేసి మరీ వస్తువులు కొనుక్కోవడం చేయరాదు. 10 రూపాయలు ఖర్చు పెట్టే చోటు 5 రూపాయలే ఖర్చు చేయండి. డబ్బును భద్రంగా పెట్టుకున్న వారే ఈ ఆరు నెలల తర్వాత బాగుంటారు. ఈ ఆర్థికపరమైన తప్పుల వల్ల కచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది” అని ఆధ్యాత్మికవేత్త నాగరాజు శర్మ తెలిపారు.
అస్సలు చేయకూడని పనులు..
* ఎవరితోనూ వాగ్వాదం చేయరాదు
* అప్పులు ఇవ్వకూడదు. ఇది చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం.
* అనవసరపు ప్రయాణాలు చేయకూడదు.
* అత్యవసరంగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు పార్వతీ పరమేశ్వరులను తలచుకుని ప్రయాణం ఆరంభించాలి. తల్లిని, తండ్రిని తలుచుకుని ప్రయాణం ప్రారంభించాలి. శ్రీ మాత్రే నమ: అని 11 సార్లు అనుకుని ప్రయాణం ప్రారంభించాలి.
చేయాల్సింది..
* సత్ సంకల్పం
* భగవత్ ధ్యానం
* దానం
* మౌన వ్రతం. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి
* నవగ్రహ స్త్రోతం చేయాలి
మొత్తంగా షష్ట గ్రహ కూటమి అనేటటువంటి అనవసరపు భయాల్లో పడొద్దు. అనవసరపు ఆలోచనలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని పండితులు సూచిస్తున్నారు.