Bhudan Pochampally : ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి
ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, మన దేశం నుంచి సిఫార్సు చేయబడ్డ 3 గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికై అరుదైన ఘనత సాధించింది.

Pochampally 11zon
Bhudan Pochampally best tourist village : ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ(UNWTO) తొలిసారిగా నిర్వహించిన ‘ఉత్తమ పర్యాటక గ్రామం’ (బెస్ట్ టూరిజం విలేజ్) ప్రతిష్టాత్మక పోటీలో తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ‘భూదాన్ పోచంపల్లి’ గ్రామం ఎంపికైంది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు రాగా, మన దేశం నుంచి సిఫార్సు చేయబడ్డ మూడు గ్రామాల నుంచి భూదాన్ పోచంపల్లి గ్రామం ‘ఉత్తమ పర్యాటక గ్రామం’గా ఎంపికై అరుదైన ఘనతను సాధించింది.
ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో సోమవారం (జనవరి 17,2022) పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, టూరిజం శాఖ ఎండీ బి.మనోహర్ రావులు సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇందుకు సంబంధించి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సంస్థ జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా వారు అందుకున్నారు.
Corona : మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో 32 మంది సిబ్బందికి కరోనా
ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించారు. టూరిజం శాఖ అధికారులు చేసిన కృషిని సీఎం కేసీఆర్ అభినందించారు.