Chandrababu : చంద్రబాబుకి ఊరట.. ఆ కేసు కొట్టివేత
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2005 లో టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.

Chandrababu
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. 2005 లో టీడీపీ నేతలపై నమోదైన కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2005లో రైతులకు మద్దతు ధర కల్పించాలని వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందు టీడీపీ నేతల ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడానికి టీడీపీ నేతలు కార్యాలయంలోకి వెళ్లారు.
అయితే, తన విధులకు ఆటంకం కలిగించేలా టీడీపీ నేతలు ప్రవర్తించారని కలెక్టర్ మహేష్ దత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఫిర్యాదు మేరకు వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు 14 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. అయితే, సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.