Nirmal BJP : నిర్మల్ జిల్లా బీజేపీకి బిగ్ షాక్, మోసం చేశారని కన్నీటిపర్యంతం
నమ్ముకున్న పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. రెండుసార్లు 2వ స్థానంలో ఉన్న తనను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరం అన్నారు.Nirmal BJP

Shock For BJP
Shock For BJP : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక వ్యవహారం బీజేపీలో చిచ్చు రేపింది. టికెట్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న వారు, తీరా టికెట్ తమకు దక్కలేదని తేలిపోవవడంతో నిరాశ చెందుతున్నారు. తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. ఎన్నికల బరిలో ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
రమాదేవి ముధోల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ముధోల్ టికెట్ ను రామారావు పటేల్ కి టికెట్ కేటాయించడంతో రమాదేవి మనస్తాపానికి గురయ్యారు. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని రమాదేవి వాపోయారు. రెండుసార్లు 2వ స్థానంలో ఉన్న తనను కాదని 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి టికెట్ కేటాయించడం బాధాకరం అన్నారు. నమ్ముకున్న పార్టీ మోసం చేసిందన్నారు. కార్యకర్తలు అభిమానులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని రమాదేవి వెల్లడించారు. టికెట్ దక్కకపోవడంతో రమాదేవి ఎమోషన్ అయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు.
”నేను ఓడిపోయినప్పుడు కూడా ఎప్పుడూ బాధపడలేదు. ఓడిపోయినప్పుడు కూడా ఎప్పుడూ ఇలా ఏడ్వలేదు. ఆర్థికంగా నేను నష్టపోయాను. అయినా నేను ఒక్కరోజు కూడా బాధపడలేదు. ఇవాళ పార్టీ నన్ను మోసం చేసింది” అని రమాదేవి కంటతడి పెట్టారు.
Also Read : బీజేపీ తొలి జాబితాలో హేమాహేమీల పేర్లు మిస్.. వారంతా పార్లమెంట్ కేనా?
రమాదేవి రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. చాలాకాలంగా ఆమె పార్టీ కోసం సిన్సియర్ గా పని చేశారు. ముధోల్ టికెట్ పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే సర్వేలను దృష్టిలో పెట్టుకుని రమాదేవిని పక్కన పెట్టి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన పీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ టికెట్ కేటాయించింది బీజేపీ హైకమాండ్. ఈ నేపథ్యంలో రమాదేవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాదు ఈ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని రమాదేవి తేల్చి చెప్పారు. కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని రమాదేవి తెలిపారు. ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతార? లేక ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా? అన్న దానిపై ప్రకటన చేయనున్నారు రమాదేవి. ముధోల్ లో కాంగ్రెస్, బీఎస్పీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో ఆ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి రమాదేవి ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.
Also Read : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. గజ్వేల్ నుంచి కేసీఆర్ పై ఈటల పోటీ