హైదరాబాద్‌లో బైకు పెట్రోల్ ట్యాంక్ పేలి.. 10 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
Bike petrol tank: అదే సమయంలో బైకు నుంచి మంటలు రావడం గుర్తించాడు. రోడ్డు పక్కకు బైకుని ఆపాడు..

హైదరాబాద్‌లో బైకు పెట్రోల్ ట్యాంక్ పేలి 10 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నగరంలోని భవానీనగర్ పరిధి మొఘల్పురా మీదుగా ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు.
అదే సమయంలో బైకు నుంచి మంటలు రావడం గుర్తించాడు. రోడ్డు పక్కకు బైకుని ఆపాడు. అక్కడి వారంతా కలిసి మంటలార్పసాగారు. అయితే, ఒక్కసారిగా బైకు పెట్రోల్ ట్యాంక్ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారికి మంటలు అంటుకున్నాయి.
గాయాలపాలైన 10 మందిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న భవానీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైకు పెట్రోల్ ట్యాంక్ పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.