Bird Flu: తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 30వేల కోళ్లను చంపి..

తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం ప్రజలు ఆందోళనకు గురిచేస్తోంది. వేలాది కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ కావడంతో ..

Bird Flu: తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం.. 30వేల కోళ్లను చంపి..

Bird Flu

Updated On : March 22, 2025 / 8:42 AM IST

Bird Flu: తెలంగాణలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గత నెలలో బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బర్డ్ ఫ్లూ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫౌల్టీఫామ్ యాజమానులకు, ప్రజలకు సూచనలు చేసింది. ఆ సమయంలో చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. అయితే, కొద్దిరోజులకే బర్డ్ ఫ్లూ ప్రభావం తగ్గిపోవటంతో మళ్లీ రాష్ట్రంలో యథాపరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులకే మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం చెలరేగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

Also Read: Bird flu: బర్డ్ ఫ్లూతో మాంసాహార ప్రియుల్లో వణుకు.. అసలు ఈ వ్యాధి ఏంటి? ఇప్పుడు చికెన్‌ తింటే మనుషులకు అంత ప్రమాదమా?

యాదాద్రి జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఓ కోళ్లఫామ్ లో ఇటీవల వందల కోళ్లు చనిపోయాయి. విషయం తెలుసుకున్న వెటర్నరీ అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపడంతో బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి జానయ్య, మరో 30మంది వైద్యులతో కూడిన బృందం శుక్రవారం కోళ్లఫామ్ వద్దకు చేరుకున్నారు.

Also Read: Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ హడల్.. చికెన్, గుడ్లు తింటున్నారా.. అయితే, తప్పనిసరిగా ఇలా చేయండి

వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లు, మాస్క్ లు ధరించి ఫామ్ లోకి వెళ్లి మొత్తం 29,796 కోళ్లను చంపేసి సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం గొయ్యి తీసి వాటిని పాతిపెట్టారు. ఫాంలోని దాదాపు 20వేల కోడిగుడ్లను, కోళ్లకు సంబంధించిన వ్యర్థాలను కూడా పూడ్చిపెట్టారు. కోళ్ల ఫాంలో ఉన్న దాణాను సీజ్ చేశారు. ఫామ్ ను పదిహేను రోజులకు ఒకసారి శానిటైజ్ చేయించాలని, మూడు నెలల పాటు కోళ్లను పెంచవద్దని కోళ్లఫాం యాజమానులకు అధికారులు సూచించారు.

Bird Flu

యాదాద్రి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య మాట్లాడుతూ.. కోళ్లఫామ్ లోని 90 టన్నుల దాణాతో పాటు కోళ్ల పెంటనుసైతం దహనం చేస్తామని చెప్పారు. కోళ్ల ఫాం నుంచి కిలో మీటర్ పరిధిలో పూర్తిస్థాయిలో శానిటేషన్ చేస్తామని, మూడు నెలల వరకు పౌల్ట్రీ ఫామ్ ను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల తరువాతే తిరిగి ఫౌల్ట్రీ ఫామ్ ను నిర్వహించాల్సి ఉంటుందని యాజమానులకు స్పష్టం చేశామని అన్నారు. దోతిగూడెంలో బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు.