అందుకే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచుతున్నారని అన్నారు.

Alleti Maheshwar Reddy (Photo: @BJP4Telangana)
తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఏడాదైందని, ఇప్పటికీ అమలు చేయలేదని తెలంగాణ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. జల్సాలకు అలవాటు పడి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచుతున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసిన సీఎంతో పాటు మంత్రులపై 420 కేసు పెట్టి విచారణ చేయాలని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని చెప్పారు. ఇది ఏ రకమైన ప్రజాపాలనో సమాధానం చెప్పాలని నిలదీశారు. విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. ఏడాది పాలన తరువాత కూడా ఒక్క నియోజకవర్గానికి కూడా డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదని చెప్పారు. ఎస్టీపీ ఫండ్ కూడా ఎమ్మెల్యేలకు కాకుండా వేరేవారికి ఇస్తే అవినీతికి తావిచ్చినట్టేనని అన్నారు. అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పారు. దాటవేత వైఖరిని అవలంభిస్తే ప్రజల తరఫున బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
టీడీపీ కార్యక్రమాల్లో చొరబడి చిల్లర పనులు చేయటం వైసీపీ నేతలకు మొదటి నుంచీ అలవాటే: పార్థసారథి