కామారెడ్డి ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ.. గెలుపుపై ధీమావ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? రెండో స్థానంలో వచ్చేది ఎవరు? మూడో స్థానానికి పడిపోయేది ఎవరు అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది.

కామారెడ్డి ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ.. గెలుపుపై ధీమావ్యక్తం చేసిన బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి

BJP Venkata Ramanareddy

Updated On : December 2, 2023 / 1:44 PM IST

Kamareddy Constituency : తెలంగాణలో ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి మెజార్టీతో మేమే అధికారంలోకి వస్తామంటూ రెండు పార్టీలు చెబుతున్నాయి. హంగ్ వస్తుందని, ఎవరు అధికారంలోకి రావాలన్నా మేమే కీరోల్ పోషిస్తామని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. తెలంగాణ ప్రజానీకం చూపంతా కామారెడ్డి నియోజకవర్గంపై ఉంది. ఇక్కడ గెలిచేది ఎవరు? అనే విషయంపై తీవ్రచర్చ జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరికి మరోవైపు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? రెండో స్థానంలో వచ్చేది ఎవరు? మూడో స్థానానికి పడిపోయేది ఎవరు అనే చర్చ జోరుగా సాగుతుంది.

10టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించి విజయాన్ని ముద్దాడేది తానేనంటూ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక, తన విజయానికి దోహదపడే కారణాలను వెంకటరమణారెడ్డి వెల్లడించారు. సర్వే సంస్థలన్నీ తానే గెలుస్తానని చెప్పాయని.. రెండు, మూడు స్థానాల గురించి
ఆలేచించలేదని గెలుపే తన లక్ష్యమని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించినట్టు చెప్పారు. స్వార్థప్రయోజనాలు లేని రాజకీయం రావాలని, ప్రజల అభీష్టం మేరకే రాజకీయ నాయకులు ఉండాలని ఆకాంక్షించారు. రాజు లాంటి రైతును చూడాలనేది తన లక్ష్యమన్నారు. వెంకటరమణారెడ్డి పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ వీడియో చూడండి..