BJP : అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ముమ్మర కసరత్తు.. ఆశావహుల్లో కొనసాగుతున్న టెన్షన్
అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది.

BJP Exercise Candidates Selection
BJP Candidates Selection : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో పార్టీ అగ్రనేతలు తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. దాదాపుగా మూడున్నర గంటలపాటుగా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సునీల్ బన్సాల్, ప్రకాశ్ జవదేకర్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, తెలంగాణ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కూడా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. బీజేపీ ఈసీ ముందు జరుగుతున్న కసరత్తు ఇది అని ఈ సందర్భంగా జవదేకర్ తెలిపారు. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు.
మరోవైపు ఫస్ట్ లిస్టు విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుండగా బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరోవైపు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఫస్ట్ లిస్ట్ విడుదలపై విభిన్న ప్రకటనలు చేయడం వారిని మరింత అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ప్రచారంలో దూసుకుపోతూవుంటే టికెట్లపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో కమలం నేతలు ఇబ్బందులు పడుతున్నారు.