Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్

తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్ అయింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో ఎందుకు పని చేయడం లేదని జాతీయ సంస్థాగత కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు.

Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్

Bjp

Updated On : July 31, 2021 / 8:27 PM IST

Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల పనితీరుపై హైకమాండ్ సీరియస్ అయింది. ప్రజా సమస్యలపై సరైన రీతిలో ఎందుకు పని చేయడం లేదని ఆ పార్టీ జాతీయ సంస్థాగత కార్యదర్శి సంతోష్ ప్రశ్నించారు. పార్టీ అనుబంధ సంఘాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో పని చేసినట్లు అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు పని చేయడం లేదని ఆయన నిలదీశారు.

25 ఏళ్ల లోపు యువతను పార్టీ ఎందుకు వాడుకోవాడం లేదన్నారు. యువ, మహిళా, మైనారిటీ, గిరిజన మోర్చాల్లో యువత ఉన్నారా అని అడిగారు. మైనారిటీ, క్రిస్టియన్ వర్గాలను ఎందుకు దూరం పెడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ కార్యవర్గాన్ని ఆయన ప్రశ్నించారు.

యువ మోర్చా, మహిళా మోర్చా, గిరిజన మోర్చా తదితర పదవులు భర్తీ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ప్రచారం మానుకుని పార్టీ కోసం పనిచేయాలని కూడా కేంద్ర బీజేపీ వర్గాలు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.