BJP Shock : టీఆర్‌ఎస్‌కు బీజేపీ షాక్‌!

మరోవైపు జిల్లాల వారీగా పార్టీలోకి చేరికలపై బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు నేతలను పార్టీలో చేర్చకుంటూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.

BJP Shock : టీఆర్‌ఎస్‌కు బీజేపీ షాక్‌!

Bjp Shock

Updated On : July 11, 2022 / 9:05 AM IST

BJP shock : టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా గట్టి షాక్‌ ఇవ్వాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యకవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై కమలనాథులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం.. మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు సిద్ధమవుతోంది. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇప్పటికే చేరికలపై సీక్రెట్ ఆపరేషన్‌ జరుగుతోందని స్పష్టత ఇచ్చారు. బీజేపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను చేర్చుకుంటే చూస్తూ ఊరుకోబోమని, కచ్చితంగా దెబ్బకు దెబ్బ కొడతామని హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు జిల్లాల వారీగా పార్టీలోకి చేరికలపై బీజేపీ నాయకత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు నేతలను పార్టీలో చేర్చకుంటూ టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆపరేషన్‌ ఆకర్ష్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Bandi Sanjay : టీఆర్‌ఎస్‌లో చాలా మంది షిండేలు : బండి సంజయ్‌

ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ద్విచక్రవాహన ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. బీజేపీ భరోసాయాత్ర పేరుతో బైక్‌ ర్యాలీలు నిర్వహించాలని బండి సంజయ్‌ తెలిపారు. ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి సరైన అభ్యర్థులు లేరో… అక్కడ చేరికలపై దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్‌ ఆకర్ష్‌ విజయవంతమయ్యే వరకు పేర్లు బయటపెట్టవద్దని భావిస్తున్నారు.