Vijayashanti: తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం.. మీ రాములమ్మ ఉద్దేశం అదే.. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన ..

Vijayashanti
Assembly Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలకు అమలుచేస్తున్నారు. మరికొద్ది గంటల్లో నామినేషన్ల ప్రక్రియసైతం షురూకానుంది. మరోవైపు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఈ సమయంలో మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర ట్వీట్ చేశారు. మీ రాములమ్మ ఉద్దేశం ఇదేనని ట్వీట్ పేర్కొన్నారు.
విజయశాంతి ట్వీట్ ప్రకారం.. 25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం, అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది. ఏ పదవి ఏనాడూ కోరుకోకున్నా.. ఇప్పటికీ అనుకోకున్నకూడా. అయితే, ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం. మన పోరాటం నాడు దశాబ్దాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరూ తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇవ్వాళ్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అనికాదు.
నా పోరాటం నేడు కేసీఆర్ కుటుంబ దోపిడీ, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై తప్ప, నాతో కలిసి తెలంగాణ ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని విజయశాంతి అన్నారు. రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్నిపార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికీ ఉండాలని మనఃపూర్వకముగా కోరుకోవటం ఎప్పటికీ మీ రాములమ్మ ఉద్దేశం.. హరహర మహాదేవ్.. జై తెలంగాణ అంటూ విజయశాంతి ట్వీట్ లో పేర్కొన్నారు.
25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం , అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది….
ఏ పదవి ఏనాడు కోరుకోకున్న…
ఇప్పటికీ అనుకోకున్న కూడా…అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం
మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు,… pic.twitter.com/LloTyHlGxe
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 31, 2023