Maheshwar Reddy: తెలంగాణాలో ‘రైతు గోస – బీజేపీ భరోసా బస్ యాత్ర’.. మహేశ్వర్ రెడ్డి యాత్రతో కదిలిన కాంగ్రెస్ మంత్రులు
శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy)ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన "రైతు గోస - బీజేపీ భరోసా బస్ యాత్ర" రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
BJP Maheshwar Reddy Raithu Gosa - BJP Bharosa Bus Yatra in Telangana
-
రైతు సమస్యలపై బీజేపీ బస్ యాత్ర
-
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర రాజకీయ ఒత్తిడి
-
భూస్థాయి సమస్యలపై బీజేపీ ప్రత్యేక ఫోకస్
Maheshwar Reddy: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తడిసిన ధాన్యం, గన్నీ బ్యాగుల కొరత, లారీల లేమి, తేమ పేరుతో కోతలు వంటి రైతు సమస్యలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్న వేళ.. బీజేపీ చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా బస్ యాత్ర” రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు నాయకత్వంలో, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు పరిగి నుండి ప్రారంభమై సారంగపూర్ సభతో ఈ యాత్ర ముగిసింది. నేరుగా కొనుగోలు కేంద్రాల్లోని రైతుల వద్దకు వెళ్లి సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఈ యాత్ర భూస్థాయిలో బలమైన రాజకీయ ఒత్తిడిని సృష్టించింది.
Cockroach Kingpin: అమ్మబాబోయ్.. ఒకేచోట లక్షల బొద్దింకలు.. ఆస్ట్రేలియాలో బయటపడ్డ విచిత్ర దందా!
ఈ యాత్ర విజయవంతం కావడం వల్లే కాంగ్రెస్ కేబినెట్ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రకటించారని కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. యాత్రలో మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ సవాల్ విసిరారు. సాధారణంగా భావోద్వేగ అంశాలకే పరిమితమవుతుందనే విమర్శలున్న బీజేపీ, ఇప్పుడు నేరుగా ప్రజా సమస్యలను అజెండాగా మార్చుకోవడం పార్టీ శైలిలో మార్పును సూచిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన ముగిసిన వెంటనే ఈ యాత్ర ప్రారంభం కావడం గమనార్హం. తెలంగాణపై ఢిల్లీ స్థాయిలోనే ప్రత్యేక వ్యూహం సిద్ధమైందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపైనే బీజేపీ పోరాడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ యాత్ర రైతు సమస్యలను ప్రధాన చర్చగా మార్చడమే కాక, అధికార పార్టీని రక్షణాత్మక స్థితిలోకి నెట్టింది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ గేర్ మార్చడానికి ఈ యాత్ర ఒక బలమైన పునాదిగా నిలిచింది.
