బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌ రావు నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్‌

"బండి సంజయ్, ఈటల రాజేందర్ మీద జరుగుతున్న ప్రచారం మీడియా ఊహాగానాలు మాత్రమే" అని తెలిపారు.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్‌ రావు నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన ఎంపీ రఘునందన్‌

Raghunandan Rao

Updated On : July 20, 2025 / 9:55 PM IST

బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా రామచందర్‌ రావు ఆ పార్టీ అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే. ఆ నియామకంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నిజంగా బీజేపీ అధ్యక్ష పదవి అందరి ఆమోదం మేరకే జరిగిందా? అధ్యక్ష నియామకం పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఇటువంటి అంశాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. 10టీవీ వీకెండ్ విత్ రఘునందన్ రావు ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.

Also Read: కుబేర సినిమా స్టైల్‌లో ఏపీలోని యాక్సిస్ బ్యాంకును మోసం చేసిన కేటుగాళ్లు.. భారీ స్కామ్..

“నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, వ్యక్తిగతం లాస్ట్ అనే సిద్ధాంతాన్ని సంపూర్ణంగా నడిపి నమ్మి నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా రామచంద్రరావుని కేంద్ర పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఆమోదం తర్వాత ప్రకటించారు.

కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకొని ప్రకటించిన తర్వాత ఇంకా అభిప్రాయ భేదాలు ఉన్నాయని, కుమ్ములాటలు ఉన్నాయన్న ఊహాగానాలు కేవలం మీడియాకు సంబంధించినంత వరకే పరిమితం. బండి సంజయ్, ఈటల రాజేందర్ మీద జరుగుతున్న ప్రచారం మీడియా ఊహాగానాలు మాత్రమే. అక్కడ ఎవరూ ఇంకొకరి పేరు తీయలేదు. భారతీయ జనతా పార్టీ నేతలు సర్పంచులుగా గెలవాలి అన్నారు” అని రఘునందన్ రావు అన్నారు.

⁠బండి, ఈటల మధ్య పంచాయితీతో పాటు, బీసీ రిజర్వేషన్ అమలుకు అడ్డు ఏంటి? బీజేపీలో గ్రూపులు ఉన్నాయా? ⁠రాజాసింగ్ ను పార్టీ పొమ్మందా? ⁠రేవంత్ సర్కార్ లోనూ పోన్ ట్యాపింగ్ జరుగుతోందా? ⁠కాంగ్రెస్సే కవితతో పార్టీ పెట్టించే ఛాన్స్ ఉందా? ⁠రేవంత్ డైరెక్షన్‌లో కవిత వెళ్తున్నారా? వంటి అంశాలపై ఎంపీ రఘునందన్‌ స్పందించారు. ఇంటర్వ్యూ చూసేయండి..