Love Trap : స్నేహం పేరుతో బాలికకు దగ్గరయ్యాడు.. ఆ తర్వాత

మిర్యాలగూడకు చెందిన ఓ బాలుడు బంధువుల ద్వారా పరిచయమైన బాలికకు ప్రేమపేర దగ్గరై ఆమె నుంచి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు డబ్బు తీసుకున్నాడు.

Love Trap : స్నేహం పేరుతో బాలికకు దగ్గరయ్యాడు.. ఆ తర్వాత

Love Trap

Updated On : November 12, 2021 / 12:08 PM IST

Love Trap :  స్నేహం పేరిట బాలికను ట్రాప్ చేసిన బాలుడిపై కుటుంబ సభ్యులు గురువారం షీటీమ్‌కు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ షీటీమ్ ఎస్ఐ మాధవిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడకు చెందిన ఓ బాలుడు బంధువుల ద్వారా పరిచయమైన బాలికకు ప్రేమపేర దగ్గరై ఆమె నుంచి డబ్బులు గుంజడం ప్రారంభించాడు. బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు డబ్బు తీసుకున్నాడు.

చదవండి : Love Tragedy : మూడేళ్ల ప్రేమాయణం….ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

తాజాగా మరోసారి తనకు డబ్బు అవసరం ఉందంటూ బాలికపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇంట్లో తల్లిదండ్రులు దాచిన రూ.40,000 దొంగిలించి అతడికి ఇచ్చింది. ఇంట్లో డబ్బులు పోవడంతో బాలికను ప్రశ్నించారు తల్లిదండ్రులు.. ఇదే సమయంలో ఆమె తడబడుతూ సమాధానం చెప్పడంతో.. గట్టిగ నిలదీశారు.. దీంతో బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది.

చదవండి : Bollywood Lovers: ఒక్కటి కాబోతున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్..!

కూతురు సమాధానం విని కంగుతిన్న కుటుంబ సభ్యులు షీటీమ్‌ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన షీటీమ్ సభ్యులు బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతూ బాలికను ట్రాప్‌ చేసిన విధానం.. ఇతర వివరాలను రాబట్టారు. అనంతరం ఇరువురికి విడివిడిగా కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.