ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Updated On : December 20, 2020 / 2:04 PM IST

Boyfriend Suicide attempt :  ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ఆమన్‌గల్‌కు చెందిన సాయిప్రసాద్‌.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ 9 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే సాయిప్రసాద్‌ ప్రేమించిన యువతికి ఆమె తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లికి నిశ్చయించారు. ఈనెల 31న ముహూర్తం కూడా పెట్టారు. ఇది తెలిసిన సాయి ప్రసాద్‌ తీవ్ర మనస్తాపానికిగురై… ఆత్మహత్యాయత్నం చేశాడు.

అంతుకుముందు సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. ప్రేమించిన యువతి మోసం చేయడంతోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్టు తెలిపాడు.