Break For Saddula Bathukamma : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. వరంగల్ లో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్

వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్ పడింది. పురుషు రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు.

Break For Saddula Bathukamma : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. వరంగల్ లో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్

Break for Saddula Bathukamma

Updated On : October 21, 2023 / 10:01 AM IST

Break For Saddula Bathukamma – Election Code Effect : తెలంగాణ ప్రతిష్టాత్మక పండగ సద్దుల బతుకమ్మపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. వరంగల్ లో సద్దుల బతుకమ్మ సంబురానికి ఏర్పాట్లు చేయలేమని జిల్లా అధికారులు చేతులెత్తేశారు. సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు అయోమయంలో పడ్డాయి. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలకు బ్రేక్ పడింది. పురుషు రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు.

ఉత్సవ కమిటీలు గందరగోళంలో పడ్డాయి. ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు జిల్లా కలెక్టర్లు లేఖ రాశారు. జీడబ్ల్యూఎంసీ ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో మహిళల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

Bathukamma 2023 : ఎనిమిదో రోజు ‘వెన్నముద్దల బతుకమ్మ’ .. ప్రసాదం ప్రత్యేకత

చందాలు వసూలు చేసుకొని ఉర్సు రంగలీల మైదానం వద్ద ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసుకుంటోంది. అధికారుల తీరుపై ఉత్సవ కమిటీలు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ఉత్సవ కమిటీ చందాలతో ఏర్పాట్లు చేస్తున్నారు.