మసాల పొడితో మర్డర్ ప్లాన్.. భార్య ఫ్యామిలీ మొత్తాన్ని.. ఇంటర్ పోల్ కూడా రంగంలోకి దిగి..
భార్యపై కోపంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని హత్య చేయాలని భర్త భావించాడు. ఈ క్రమంలో విషప్రయోగం ద్వారా వారి కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు.

attempted murder case
Attempted murder case: భార్యపై కోపంతో ఆమెను, ఆమె కుటుంబాన్ని హత్య చేయాలని భర్త భావించాడు. ఈ క్రమంలో విషప్రయోగం ద్వారా వారి కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నాడు. అదేపని చేయగా.. భార్య తల్లి మరణించగా.. ఆమె సోదరుడు అస్వస్థకు గురయ్యాడు. తన భర్త కారణంగానే ఇదంతా జరిగిందని గుర్తించిన భార్య.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.. రెండేళ్ల క్రితం మియాపూర్ లో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి నిందితుడిని బ్రిటన్ లో పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 17న ఇంటర్ పోల్ సాయంతో అక్కడి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: ఘోర విమాన ప్రమాదం.. పరస్పరం ఢీకొని నదిలో కూలిపోయిన విమానం, హెలికాప్టర్ .. వీడియో వైరల్
ముప్పరపు అజిత్, శిరీష భార్యాభర్తలు. వారిద్దరూ కొన్నాళ్లు యూకేలో ఉన్నారు. ఆ సమయంలో తనను మానసికంగా వేధిస్తున్నాడని యూకేలో భర్త అజిత్ కుమార్ పై శిరీష ఫిర్యాదు చేసింది. దీంతో భార్య శిరీషతోపాటు ఆమె కుటుంబంపై అజిత్ కక్ష పెంచుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులను అంతం చేయాలని భావించాడు. ఎవరికీ అనుమానం రాకుండా హత్యచేయాలనుకున్నాడు. ఇందుకోసం ఒక ముఠాను తయారు చేసుకున్నాడు. ఆహారంలో విషం కలిపి చంపేలాయనుకొని విఫలమయ్యాడు. అయితే, భార్య కుటుంబానికి పంపించిన మాసాల పొడుల్లో ముఠా సహాయంతో పాదరసాన్ని కలిపించాడు. దాన్ని ఆహారంలో కలుపుకొని తిన్న శిరీష తల్లి ఉమా మహేవ్వరి చికిత్స పొందుతూ 2023లో మరణించింది. శిరీష సోదరుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో భర్తను అనుమానించిన శిరీష అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శిరీష ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకిదిగి ఈ కేసు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు. ముప్పరపు అజిత్ బ్రిటన్ పారిపోయాడు. ఈనెల 17న ఇంటర్ పోల్ సాయంతో అక్కడి అధికారులు అజిత్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే, అజిత్ ను హైదరాబాద్ రప్పించేందుకు కావాల్సిన చర్యలను సైబరాబాద్ పోలీసులు చేపట్టారు.