కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు.. ‘తానే ఒక చరిత్ర’ పేరిట 30 నిమిషాల డాక్యుమెంటరీ
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతిఒక్కరూ మొక్క నాటాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.

BRS Chief KCR
BRS Chief KCR Birthday : ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇవాళ్టితో 70వ ఏట అడుగిడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం వ్యాప్తంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణ భవన్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. కేసీఆర్ 70వ పుట్టిన రోజును గుర్తుచేసేలా 70కిలోల భారీ కేక్ ను కట్ చేయనున్నారు. అనంతరం కేటీఆర్ చేతుల మీదుగా వెయ్యి మంది ఆటో డ్రైవర్లకు లక్ష చొప్పున ఇన్సూరెన్స్ పత్రాలను, దివ్యాంగులకు వీల్ చైర్లను పంపిణీ చేస్తారు.అనంతరం తానే ఒక చరిత్ర పేరిట 30 నిమిషాల డాక్యుమెంటరీని కేటీఆర్ ప్రారంభిస్తారు.
Also Read : KTR : ఇది బీఆర్ఎస్ తొలి విజయం..కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రతిఒక్కరూ మొక్క నాటాలని రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ప్రజలను కోరారు. ఇదిలాఉంటే కేసీఆర్ బర్త్ డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు.
స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు#JaiKCR#JaiTelangana pic.twitter.com/GRA8yWQ7nO
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2024