YS Sharmila : అందుకే.. కవితను అరెస్ట్ చేయలేదు, కేసీఆర్‌పై విచారణ జరిపించలేదు- వైఎస్ షర్మిల మరో సంచలన ట్వీట్

YS Sharmila : బీఆర్ఎస్ అంటే "బీజేపీకి రహస్య సమితి". బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం.

YS Sharmila : అందుకే.. కవితను అరెస్ట్ చేయలేదు, కేసీఆర్‌పై విచారణ జరిపించలేదు- వైఎస్ షర్మిల మరో సంచలన ట్వీట్

YS Sharmila (Photo : Twitter, Google)

Updated On : July 6, 2023 / 8:01 PM IST

YS Sharmila – CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారు. వరుసగా ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ పాలన, వైఖరిపై ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే పలు ట్వీట్లతో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన షర్మిల తాజాగా మరోసారి మండిపడ్డారు. ఈసారి బీజేపీని కూడా కార్నర్ చేశారు. ఆ పార్టీపైనా తీవ్ర విమర్శలు చేశారామె.

” కేసీఆర్, బీజేపీ ఒక్కటి కాదని చిన్నదొర నొక్కినొక్కి చెబుతుంటే.. చిన్న పిల్లవాడు కూడా నమ్మడం లేదు పాపం. తెలంగాణలో లేని బీజేపీని పైకిలేపి, ఇన్నాళ్లు విమర్శలు గుప్పించిన కేసీఆర్.. కొడుకు, కూతురు కేసులతో కథ అడ్డం తిరిగే సరికి బీజేపీతో జతకట్టాడు. కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం వద్ద మోకరిల్లాడు.

Also Read..Telangana BJP : బీజేపీకి వరుస షాక్‌లు..? ఏనుగు రవీందర్ రెడ్డి బాటలో మరికొందరు..! కేసీఆర్‌ను ఓడించడం కష్టమని..

ఒక్కసారిగా కేసీఆర్ నాలుక బీజేపీ నుంచి ఇంకో పార్టీకి మళ్లింది. తొమ్మిదేళ్లుగా విభజన హామీలపై మోడీని నిలదీయలేని బీఆర్ఎస్.. బీజేపీకి ‘బీ’ టీం కాదా? రాష్ట్రానికి వచ్చే నిధుల వాటా గురించి మాట్లాడలేని కేసీఆర్.. మోడీ తొత్తు కాదా? కాళేశ్వరంలో కేసీఆర్ రూ.వేల కోట్లు తినేసినా కనీసం విచారణ చేయించని బీజేపీ.. బీఆర్ఎస్ కు మద్దతు తెలిపినట్లు కాదా? లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు అడ్డంగా దొరికినా బేడీలు వేయని బీజేపీ.. బీఆర్ఎస్ ను కాపాడుతున్నట్లు కాదా?

Also Read..Anil Kumar : నా ఆస్తులపై తిరుమలలో ప్రమాణం చేస్తా.. మిగిలిన బ్యాలెన్స్ ఎప్పుడిస్తారు? : ఎమ్మెల్యే అనిల్ కుమార్

బీఆర్ఎస్ అంటే “బీజేపీకి రహస్య సమితి”. బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం. బీజేపీతో కేసీఆర్ చేస్తున్నది సమరం కాదు.. వ్యభిచారం” అంటూ చెలరేగిపోయారు షర్మిల.