Harish Rao : కవిత ఆరోపణలపై మాజీమంత్రి హరీశ్‌రావు స్ట్రాంగ్ రియాక్షన్.. మా లక్ష్యం అదే..

కవిత (kavitha) ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) స్పందించారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

Harish Rao Reacts kavitha Allegations

Harish Rao Reacts kavitha Allegations : బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత (kavitha) మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పై ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తరువాత ఆమె మాట్లాడుతూ.. హరీశ్ రావు, సంతోష్ కుమార్‌లు కాంగ్రెస్, బీజేపీలతో టచ్‌లో ఉంటూ కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని హస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారంటూ కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కవిత ఆరోపణలపై హరీశ్ రావు తాజా స్పందించారు. ఈ క్రమంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Also Read: Kavitha Suspended: కారు నుంచి కవితను దించేయడానికి అసలు కారణం అదేనా? కేసీఆర్ మాట వినుంటే ఫ్యూచర్ మరోలా ఉండేదా?

విదేశీ పర్యటన ముగించుకొని హరీశ్‌రావు శనివారం ఉదయం రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. కీలక కామెంట్స్ చేశారు. నాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై చేసిన వ్యాఖ్యలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను. నా 25ఏళ్ల రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగుతున్నా. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికి తెలుసునని హరీశ్ రావు అన్నారు.

రాష్ట్రంలో ఈరోజు ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడుతున్నారు. మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడం మా కర్తవ్యం. ద్రోహుల చేతుల్లో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుంది. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటాం. మా లక్ష్యం అదే. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని హరీశ్ రావు అన్నారు.